T20 World Cup: కోహ్లీ బ్యాటింగ్‌ చూసి వారిద్దరికీ మాటలు రాలేదు..

న్యూజిలాండ్‌తో తలపడే కీలక మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా నెట్స్‌లో బాగా కష్టపడుతోంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా కసిగా సాధన చేస్తున్నారు...

Updated : 16 Nov 2021 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో తలపడే కీలక మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా నెట్స్‌లో బాగా కష్టపడుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోతే సెమీస్‌ అవకాశాలు క్లిష్టమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆటగాళ్లంతా కసిగా సాధన చేస్తున్నారు. తాజాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నెట్స్‌లో సాధన చేస్తున్న వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తమ కెప్టెన్‌ ఎలా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడో చూసి ఆశ్చర్యపోయారు. కోహ్లీ షాట్లు చూసి వారిద్దరికీ మాటలు రావడం లేదని ఆ పోస్టుకు వ్యాఖ్యానం జతచేసింది.

మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైన హార్దిక్ పాండ్య బౌలింగ్‌ చేయలేని సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతడు భుజం గాయంతో ఇబ్బంది పడగా రెండో ఇన్నింగ్స్‌లో మ్యాచ్‌లో పాల్గొనలేదు. అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా వచ్చాడు. ఈ క్రమంలోనే హార్దిక్‌ తుదిజట్టులో ఉండి బౌలింగ్‌ చేయకపోతే లాభమేంటని పలువురు క్రికెట్‌ విశ్లేషకులు సైతం పెదవి విరిచారు. దీంతో అతడు తాజాగా నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను కూడా ఐసీసీ ట్విటర్‌లో పంచుకుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని