T20 World Cup: కీలకపోరులో చేతులెత్తేసిన భారత బ్యాటర్లు

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో కీలకమైన పోరులో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి

Updated : 31 Oct 2021 21:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో కీలకమైన పోరులో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. రోహిత్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌తో ఓపెనింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (ఎనిమిది బంతుల్లో 4 పరుగులు) దారుణంగా విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్‌ (14)తో కలిసి కేఎల్ రాహుల్‌ (18) కాస్త కుదురుకున్నట్లే కనిపించాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరితోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) పెవిలియన్‌కు చేరారు. టాప్‌-ఆర్డర్‌ బ్యాటర్లు నలుగురూ బౌండరీలైన్‌ వద్దే క్యాచ్‌ ఔట్ కావడం గమనార్హం. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ పాండ్య (23)తో కలిసి రిషభ్‌ పంత్ (12) టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ను ఆదుకుంటాడేమోనని భావించినా.. మరోసారి సగటు అభిమానికి నిరాశే ఎదురైంది. కివీస్‌ బౌలర్ మిల్నే బౌలింగ్‌లో పంత్ క్లీన్‌బౌల్డయ్యాడు. అప్పటికి భారత్‌ 15 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. అయితే, చివర్లో జడేజా (26*) కాస్త బ్యాట్‌ను ఝళిపించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో బౌల్ట్ 3, సోధి 2, సౌథీ, మిల్నే తలో వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని