Aus vs NZ Final: ఆస్ట్రేలియానే ఫేవరెట్‌.. ఎందుకో వివరించిన గావస్కర్‌

ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టుకు తిరుగులేని రికార్డున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ అదే గెలుస్తుందని టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్ అభిప్రాయపడ్డాడు...

Updated : 14 Nov 2021 10:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టుకు తిరుగులేని రికార్డున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ అదే గెలుస్తుందని టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు మొత్తం 18 సార్లు తలపడగా అందులో 12 సార్లు కంగారూలే విజయం సాధించారు. అలాగే మొత్తం 31 నాకౌట్‌ మ్యాచ్‌ల్లో 20 విజయాలు సాధించి దాదాపు అన్ని జట్లపైనా ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించింది. ఈ క్రమంలోనే ఐదుసార్లు వన్డే ప్రపంచకప్‌ విజేతగా, రెండు సార్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ ఛాంపియన్‌గా అవతరించింది.

ఇక తాజా ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరడంతో గావస్కర్‌ మీడియాతో మాట్లాడారు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఘన చరిత్ర కలిగిన ఆస్ట్రేలియా జట్టే ఫేవరెట్‌గా ఉందని.. కీలక మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓడిన వాటికన్నా గెలిచిన సందర్భాలే ఎక్కువని చెప్పుకొచ్చారు. బరిలోకి దిగాక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమకు అనుకూలంగా మార్చుకుంటారని పొగిడారు. ఆ జట్టు ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చిందని.. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కేవలం న్యూజిలాండ్‌పైనే కాకుండా అన్ని జట్లపైనా కంగారూల ఆధిపత్యం కొనసాగిందని గుర్తుచేశారు. ఈసారి కూడా అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ముద్దాడతారని గావస్కర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని