Updated : 06 Nov 2021 08:41 IST

Virat Kohli: ఆదివారం  ఏం జరుగుతుందో చూడాలి : విరాట్‌ కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. శుక్రవారం రాత్రి స్కాట్లాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 85 పరుగులకే కట్టడి చేసిన కోహ్లీసేన.. ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో గ్రూప్‌-2లో అత్యధిక రన్‌రేట్‌ కలిగిన జట్టుగా నిలిచింది. ఇక ఆదివారం అఫ్గానిస్థాన్‌ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించడమే మిగిలింది. అదే జరిగితే భారత్‌ సెమీస్‌ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విజయంపై మాట్లాడిన కోహ్లీ ఇలాంటి ప్రదర్శన కోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పాడు.

‘ఇది సంపూర్ణ ఆధిపత్యం. ఇలాంటి ప్రదర్శనే మరోసారి చేయాలని చూస్తున్నాం. ఇక ఇప్పుడు ఆదివారం (నవంబర్‌ 7) ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది. ఆ మ్యాచ్‌ ఎలా సాగుతుందో చూడాలి. ఈ రోజు ఆట గురించి పెద్దగా చెప్పాలని లేదు. మేం ఏం చేయగలమో మాకు తెలుసు. అలాగే ఈ వేదికపై టాస్‌ ఎంత కీలకమో కూడా తెలిసింది. స్కాట్లాండ్‌ను 110 లేదా 120లోపు కట్టడి చేయాలనుకున్నాం. బౌలర్లు మెరిశారు. రాహుల్‌ బాగా ఆడాడు. ఇక ఛేదనలో మేం 8-10 ఓవర్ల మధ్య లక్ష్యాన్ని పూర్తి చేయాలని చూశాం. రోహిత్‌, రాహుల్‌ నిలకడగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని అనుకున్నాం. రెచ్చిపోయి ఆడాలని అనుకోలేదు. ఎందుకంటే అలాంటి సమయంలో రెండు మూడు వికెట్లు పడ్డా ఆట మరో మూడు ఓవర్లు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. మేం ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ ఇలాగే ఆడాం. మా సహజమైన ఆట కూడా ఇలాగే ఉంటుంది. కానీ, ఆ రెండు మ్యాచ్‌ల్లోనే (పాక్‌, కివీస్‌ మ్యాచ్‌లు) కుదరలేదు. ఆ రెండు జట్లు బౌలింగ్‌ అద్భుతంగా చేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాయి. ఈరోజు జడేజా, షమి బాగా బౌలింగ్‌ చేశారు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

అనుష్క, వామికా ఉంటే చాలు..

అనంతరం తన పుట్టిన రోజు వేడుకలపై మాట్లాడిన కోహ్లీ.. తాను సెలబ్రేట్‌ చేసుకునే దశ దాటిపోయానని చెప్పాడు. తన కుటుంబం పక్కనే ఉంటే చాలని, ఇప్పుడు బయోబబుల్‌ లాంటి పరిస్థితుల్లో అనుష్క, వామికా తనతో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశాడు. అదే తనకు సెలబ్రేషన్స్‌ లాంటిదని తెలిపాడు. టీమ్‌ఇండియా బాగా ఆడిందని, ప్రతి ఒక్కరూ తనకు శుభాకాంక్షలు చెప్పారని కోహ్లీ అన్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని