Tokyo Olympics: జ్వెరెవ్ కెరీర్లో అతిపెద్ద విజయం..
ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ సంచలన విజయం సాధించాడు. ఫైనల్స్‌లో రష్యా ఆటగాడు కారన్ కచనోవ్‌పై 6-3, 6-1 తేడాతో గెలుపొంది బంగారు...
టెన్నిస్ సింగిల్స్‌లో బంగారు పతకం సాధించిన జర్మన్ ఆటగాడు..
టోక్యో: ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ సంచలన విజయం సాధించాడు. ఫైనల్స్‌లో రష్యా ఆటగాడు కారన్ కచనోవ్‌పై 6-3, 6-1 తేడాతో గెలుపొంది బంగారు పతకం సాధించాడు. దీంతో కెరీర్లోనే అతిపెద్ద విజయం కైవసం చేసుకున్నాడు. కాగా, జ్వెరెవ్ కెరీర్లో ఇప్పటివరకూ ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా లేకపోయిన సంగతి తెలిసిందే. గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి డొమినిక్ థీమ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. అదే జ్వెరెవ్‌కు ఇప్పటివరకున్న అత్యుత్తమ ప్రదర్శన. ఆదివారం ఒలింపిక్స్ ఫైనల్స్‌లో విజయం సాధించడంతో తొలిసారి స్వర్ణం సాధించాడు. ఇదే విజయంతో జర్మనీ తరఫున టెన్నిస్‌లో సింగిల్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగానూ జ్వెరెవ్ రికార్డు నెలకొల్పాడు. ఒక గంట 19 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జర్మన్ ఆటగాడు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కచనోవ్కు ఏ అవకాశం ఇవ్వకుండా తన కలను సాకారం చేసుకున్నాడు. మరోవైపు సెమీస్‌లో అతడు దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఇక జకోవిచ్ శనివారం కాంస్యం కోసం తలపడిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలై తీవ్ర నిరాశకు గురయ్యాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టా చేతిలో 4-6, 7-6 (6), 3-6 తేడాతో ఓడిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్