Tokyo Olympics: హాకీలో అదరగొడుతున్న టీమ్‌ఇండియా

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో అదరగొడుతోంది. శుక్రవారం పూల్‌-ఏ విభాగంలో జపాన్‌తో తలపడిన సందర్భంగా భారత్‌ 5-3 తేడాతో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది...

Published : 30 Jul 2021 18:34 IST

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో అదరగొడుతోంది. శుక్రవారం పూల్‌-ఏ విభాగంలో జపాన్‌తో తలపడిన భారత్‌ 5-3 తేడాతో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో పూల్‌-ఏలో టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా తర్వాత నాలుగు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కాగా, ఈ పూల్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్‌ కేవలం ఆస్ట్రేలియాతోనే 1-7 తేడాతో ఓటమిపాలైంది.

మరోవైపు టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఆది నుంచీ ఆధిపత్యం చెలాయించింది. గుర్జంత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత 17వ నిమిషంలో ఒక స్ట్రైక్‌ చేసిన అతడు తర్వాత 56వ నిమిషంలోనూ మరో స్ట్రైక్‌ సాధించాడు. ఈ క్రమంలోనే హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 13వ నిమిషంలో, శంషర్‌ సింగ్‌ 34వ నిమిషంలో, నీలకంఠ శర్మ 51వ నిమిషంలో గోల్స్‌ సాధించారు. మధ్యలో జపాన్‌ గట్టి పోటీనిచ్చినా చివర్లో భారత ఆటగాళ్లు పుంజుకొని ఆధిపత్యం చెలాయించారు. దాంతో పూల్‌-ఏలో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని