Shardul Thakur: శార్దూల్‌.. కిర్రాక్‌! వీర బాదుడుకు ట్విటర్లో ప్రశంసల వర్షం

ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ను చితకబాదిన యువ క్రికెటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమ్‌ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అతడిని అభినందిస్తున్నారు....

Published : 03 Sep 2021 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ను చితకబాదిన యువ క్రికెటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమ్‌ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అతడిని అభినందిస్తున్నారు. అతడే లేకుంటే కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 150 మించేది కాదని పేర్కొంటున్నారు.

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. గాయం కారణంగా ఇన్నాళ్లూ జట్టుకు దూరమైన అతడు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 36 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఇందులో 7 బౌండరీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. 31 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయిని అందుకున్న శార్దూల్‌ టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో వేగంగా అర్ధశతకం చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు కపిల్‌దేవ్‌ 30 బంతుల్లోనే చేశాడు. ఇక ఇంగ్లాండ్‌ గడ్డపై అతి తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసింది మాత్రం శార్దూలే. 1986లో ఇయాన్‌ బోథమ్‌ 32 బంతుల్లో 50 రికార్డును అతడు బద్దలు కొట్టాడు.

ఒకవైపు వరుసగా వికెట్లు పడుతుండటంతో వేగంగా పరుగులు చేయాల్సిన భారం శార్దూల్‌పై పడింది. దాంతో అతడు ఆంగ్లేయులపై విరుచుకుపడ్డాడు. చక్కని క్రికెటింగ్‌ షాట్లు ఆడాడు. భారత వికెట్ల పతనాన్ని శాసించిన రాబిన్సన్‌, క్రిస్‌వోక్స్‌ బౌలింగ్‌నూ అతడు చితకబాదేశాడు. దాంతో  టీమ్‌ఇండియా 191 పరుగులు చేయగలింది. అతడి ప్రదర్శనపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని