Team India: డ్రెస్సింగ్‌ రూమ్‌లో కుర్రాళ్లకు ఎలాంటి స్వాగతం లభించిందో చూస్తారా!

నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమ్‌ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో భారత్‌ గెలవడంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సరదాగా గడిపారు....

Updated : 31 Oct 2023 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగో టెస్టులో విజయం సాధించిన టీమ్‌ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో భారత్‌ గెలవడంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సరదాగా గడిపారు. ఇంగ్లాండ్‌ ఆఖరి వికెట్‌ పడగానే మైదానం హోరెత్తింది. భారత అభిమానులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. ఆటగాళ్లంతా హుషారుగా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి చేరుకున్నారు. మైదానం నుంచి వస్తున్న ఒక్కొక్కరిని.. సిబ్బంది, ఆటగాళ్లు ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

‘దీనిని మిస్సవ్వకండి! చారిత్రక విజయం తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో మీరు చూడని స్పందనలు, దృశ్యాలను మీ ముందుకు తెస్తున్నాం’ అంటూ బీసీసీఐ ఆ వీడియోకు వ్యాఖ్యను జత చేసింది. సెంచరీ వీరుడు రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఆ వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడారు. 

‘వికెట్‌ మందకొడిగా ఉందని తెలుసు. అందుకే ఐదో రోజు మేం మరింత కష్టపడ్డాం. మంచి లెంగ్తుల్లో బంతులు వేశాం. పరుగులు నియంత్రించేందుకు ప్రయత్నించాం. అప్పుడు వికెట్లు పడతాయని తెలుసు’ అని ఉమేశ్‌ యాదవ్‌ అన్నాడు. ఆటపై తన ప్రభావం చూపించాలని అనుకున్నానని శార్దూల్‌ ఠాకూర్‌ చెప్పాడు. ‘గొప్పగా అనిపిస్తోంది. నేను ఆడతానని తెలిసిన రోజు నుంచి ఆటపై ప్రభావం చూపించాలని భావించాను. జట్టు గెలిచేందుకు అవసరమైన ప్రతిదీ చేయాలని అనుకున్నాను’ అని ఠాకూర్‌ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని