Virat Kohli and KL Rahul: ఎక్కడికక్కడే నిలిచిన విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఎక్కడికక్కడే నిలిచారు. వీరిద్దరు పొట్టి ఫార్మాట్‌లో నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారు...

Updated : 15 Sep 2021 17:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ఎక్కడికక్కడే నిలిచారు. వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌లో నాలుగు, ఆరు స్థానాల్లో నిలిచారు. ఇంతకుముందు కూడా ఇవే స్థానాల్లో కొనసాగుతున్న టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లోనూ అక్కడే ఉన్నారు. మరోవైపు భారత బౌలర్లలో ఏ ఒక్కరూ టాప్‌-10లో లేకపోవడం గమనార్హం.

బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ డేవిడ్‌ మలన్‌ 841 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ 819 పాయింట్లతో రెండు, ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆరోన్‌ ఫించ్‌ 733 పాయింట్లతో మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ 717 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ డివాన్‌ కాన్వే 700 పాయింట్లతో ఐదు, కేఎల్‌ రాహుల్‌ 699 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు.

మరోవైపు బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తబ్రేజ్‌ శంసీ 775 పాయింట్లతో తొలి ర్యాంక్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో శ్రీలంక స్పిన్నర్‌ వానిండు హసరంగా 747, అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 719 పాయింట్లతో ఉన్నారు. ఈ జాబితాలో టీమ్‌ఇండియా బౌలర్లు ఒక్కరూ టాప్‌-10లో లేకపోవడం గమనార్హం. భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రం 12, 18 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇక చివరగా ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్య టాప్‌-20లో చోటు దక్కించుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని