గబ్బర్‌ సేన విజయానికి కోహ్లీసేన మురిపెం!

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. దీపక్‌ చాహర్‌ (69*; 82 బంతుల్లో 7×4, 1×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (53; 44 బంతుల్లో 6×4) విజృంభించిన వేళ.. టీమ్‌ఇండియా 276 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది.

Published : 21 Jul 2021 13:50 IST

కుర్రాళ్ల ఆటకు సీనియర్లు ఫిదా

ముంబయి: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. దీపక్‌ చాహర్‌ (69*; 82 బంతుల్లో 7×4, 1×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (53; 44 బంతుల్లో 6×4) విజృంభించిన వేళ.. టీమ్‌ఇండియా 276 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది. కాగా లంకలో గబ్బర్‌సేన విజయానికి ఇంగ్లాండ్‌లోని కోహ్లీసేన కేరింతలు కొట్టడం విశేషం.

ఒకేసారి రెండు వేర్వేరు దేశాల్లో టీమ్‌ఇండియా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్లతో కూడిన కోహ్లీసేన ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు సిద్ధమవుతోంది. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన గబ్బర్‌ సేన లంకలో రెండు సిరీసులు ఆడుతోంది. కాగా మొదటి వన్డేను సునాయసంగా గెలిచిన భారత్‌, రెండో వన్డేలో కాస్త చెమటోడ్చింది. ఛేదనలో 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌తో పేసర్‌ దీపక్‌ చాహర్‌ అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆఖర్లో లంక స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఫలితం ఏమవుతుందో అన్న ఆసక్తి కలిగింది. హసరంగ లెగ్‌స్పిన్‌ను ఎదుర్కొంటూనే, మిగతా వాళ్ల బౌలింగ్‌లో బౌండరీలు బాదడంతో గబ్బర్‌సేన విజయం అందుకుంది. ఈ విజయాన్ని భారత అభిమానులే కాకుండా ఇంగ్లాండ్‌లోని కోహ్లీసేన సైతం ఆస్వాదించింది. ఆఖరి వరకు వారు మ్యాచును వీక్షించారు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని