Virat Kohli: నాయకుడిగా ‘కింగ్‌  కోహ్లీ’ అరుదైన రికార్డు

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ నాయకుడిగా అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. లార్డ్స్‌ గెలుపుతో అతడు మరో రెండు ఘనతలు అందుకున్నాడు...

Published : 18 Aug 2021 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ నాయకుడిగా అరుదైన రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. లార్డ్స్‌ గెలుపుతో అతడు మరో రెండు ఘనతలు అందుకున్నాడు. కపిల్‌ దేవ్‌ (1986), మహేంద్ర సింగ్‌ ధోనీ (2014) తర్వాత లార్డ్స్‌లో విజయం సాధించిన భారత మూడో కెప్టెన్‌గా అవతరించాడు. సారథిగా ఎక్కువ టెస్టు విజయాలు అందుకున్న నాలుగో ఆటగాడిగా ఎదిగాడు. క్లైవ్‌ లాయిడ్‌ను అధిగమించాడు.

* దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన వారిలో ముందున్నాడు. అతడు 109 మ్యాచులకు సారథ్యం వహించగా 53 గెలిచాడు. 29 ఓడాడు.

* ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతడి సారథ్యంలో ఆసీస్‌ ఎలాంటి విజయాలు సాధించిందో అందరికీ తెలిసిందే. అతడు 77 మ్యాచుల్లో సారథ్యం వహిస్తే 48సార్లు గెలిపించాడు. 16 మ్యాచుల్లో ఓటమి పాలయ్యాడు.

* ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ వాకు ఘనమైన చరిత్రే ఉంది. కంగారూలకు తిరుగులేని నాయకత్వం అందించాడు. 57 టెస్టులకు సారథ్యం వహిస్తే ఆసీస్‌ ఏకంగా 41 గెలవడం సాధారణ విషయం కాదు. కేవలం 9 మాత్రమే ఓడింది.

* భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ జాబితాలో నాలుగో స్థానానికి ఎదిగాడు. 63 మ్యాచుల్లో టీమ్‌ఇండియాను నడిపించగా 37 సార్లు గెలిపించాడు. కేవలం 15 మ్యాచుల్లోనే ఓటమి పాలయ్యాడు.

* వెస్టిండీస్‌ మాజీ సారథి క్లైవ్‌ లాయిడ్‌ అద్భుతమైన సారథి. కరీబియన్‌ జట్టుకు 74 మ్యాచుల్లో సారథ్యం వహించగా 36సార్లు గెలిపించాడు. కేవలం 12 ఓటములే అతడి ఖాతాలో ఉన్నాయి. విరాట్‌ అతడిని అధిగమించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని