
Ganguly or Dhoni: అతడే టీమ్‌ఇండియా అత్యుత్తమ సారథి: సెహ్వాగ్
ఇంటర్నెట్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీల మధ్య ఎవరు గొప్ప కెప్టెన్ అని అడిగితే సగటు అభిమాని తేల్చుకోవడం చాలా కష్టం. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును ఒకరు ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తే.. అదే జట్టును మరొకరు ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరినీ తక్కువ చేయడానికి కుదరదు. అయితే, ఇదే విషయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించాడు.
తన దృష్టిలో ఇద్దరు మాజీలు గొప్ప సారథులని, ఎవరికి వారే ప్రత్యేకమని కొనియాడాడు. విపత్కర పరిస్థితుల్లో గంగూలీ టీమ్‌ఇండియాను ఏకతాటిపైకి తెచ్చాడని, నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసి భారత్‌ను కొత్తగా తీర్చిదిద్దాడని చెప్పాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా విదేశాల్లో ఎలా గెలవాలో రుచిచూపించాడని తెలిపాడు. ఇక ధోనీ విషయానికి వస్తే.. అతడు కెప్టెన్సీ చేపట్టే సమయానికే భారత్ గొప్ప జట్టుగా ఉందని, అది అతడికి కలిసొచ్చిందని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ధోనీకి కొత్త జట్టును తయారుచేయడంలో పెద్ద కష్టం కాలేదన్నాడు. ఇద్దరూ గొప్పసారథులని చెప్పాడు. కానీ, తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు గంగూలీనే అత్యుత్తమ సారథి అని స్పష్టం చేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.