Published : 11 Sep 2021 02:40 IST

US Open: యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఎమ్మా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ యువ టెన్నిస్‌ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. యూఎస్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. తాజాగా 17వ సీడ్‌ గ్రీస్‌ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో సెమీఫైనల్స్‌లో గెలిచిన ఎమ్మా ఈ ఘనత సాధించింది. దీంతో 17 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన పిన్న వయస్కురాలిగానూ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ప్రముఖ క్రీడాకారిణి మారియా షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్‌ టైటిల్‌ గెలవడం గమనార్హం.

ప్రస్తుతం 150వ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా.. ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి లెయ్‌లా ఫెర్నాండెజ్‌(19)తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ఆమె ఈ మ్యాచ్‌లో మారియాను ఓడించిన వీడియోను యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ ట్విటర్‌లో పంచుకుంది. అందులో ఈ బ్రిటన్‌ చిన్నది సాధించిన విజయాన్ని తనను తానే నమ్మలేకపోయింది. చివరిపాయింట్‌ సాధించాక కాసేపు తలను పట్టుకొని అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయింది. మ్యాచ్‌ అనంతరం ఆమె మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసింది. తాను ఫైనల్‌కు చేరానంటే నమ్మలేకపోతున్నానని చెప్పింది. తనపై ఒత్తిడి లేదని, తుదిపోరులో మంచి ప్రదర్శన చేస్తానని తెలిపింది. మరోవైపు రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరు టీనేజీ క్రీడాకారులు మహిళల గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో పోటీపడనుండటం విశేషం. 1999లో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్‌ మార్టినా హింగిస్‌ అనే 18 ఏళ్ల క్రీడాకారిణితో పోటీపడి ఓడించింది.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని