Virat Kohli: ఇషాంత్‌ను ఆటపట్టించిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా ప్రయాణం చూడండి..!

టీమ్‌ఇండియా ఆటగాళ్లు గురువారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 26 నుంచి రెండు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో కోహ్లీసేన ప్రత్యేక విమానంలో...

Updated : 17 Dec 2021 16:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాళ్లు గురువారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈనెల 26 నుంచి రెండు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో కోహ్లీసేన ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి జోహనెస్‌బర్గ్‌కు వెళ్లిపోయింది. అయితే, ఆటగాళ్ల ప్రయాణం ఎలా సాగిందనే విషయాన్ని బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ఓ వీడియోరూపంలో అభిమానులతో పంచుకుంది. అందులో ఆటగాళ్లంతా సరదాగా కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మను ఆటపట్టించాడు. ఇషాంత్‌ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని, అయితే.. తన వెంట అవసరమైన ఓ సూట్‌కేస్‌ కచ్చితంగా ఉండాలని విరాట్‌ అన్నాడు. దానికి స్పందించిన అతడు.. తనని ఇలా ఆటపట్టించొద్దని, ముఖ్యంగా ఉదయం వేళ ఇలా చేయొద్దని కెప్టెన్‌ను కోరాడు. మరోవైపు ప్రధానకోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం శ్రేయస్‌ అయ్యర్‌ పక్కన కూర్చొని సరదాగా నవ్వుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.


Video Courtesy: #BCCI


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని