PV Sindhu: పీవీ సింధు కోచ్ ఓ హీరో : కేంద్రమంత్రి రిజిజు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి స్వదేశానికి చేరుకున్న భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. నిన్న మధ్యాహ్నం దిల్లీ

Updated : 04 Aug 2021 11:44 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి స్వదేశానికి చేరుకున్న భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. నిన్న మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న సింధు, ఆమె కోచ్‌ పార్క్‌ను‌.. పలువురు కేంద్రమంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కోచ్‌ పార్క్‌పై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో హీరో అయ్యారంటూ కొనియాడారు.

మంగళవారం రాత్రి సింధు, కోచ్‌ పార్క్‌.. కిరణ్‌ రిజిజు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ కేంద్రమంత్రి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా పార్క్‌తో కొంతసేపు ముచ్చటించిన రిజిజు.. ‘‘మీ సపోర్ట్‌కు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు భారత్‌లో మీరు హీరో అయ్యారు. ప్రతి భారతీయుడికి మీ గురించి తెలిసింది’’ అని ప్రశంసించారు. సింధు ఛాంపియన్‌గా మారడంలో అండగా నిలిచిన ఆమె కోచ్‌, తల్లిదండ్రులు, బ్యాడ్మింటన్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులకు రిజిజు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేంద్రమంత్రి తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

అంతకుముందు సింధు, కోచ్‌ పార్క్‌.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నేడు ఆమె ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని