Tennis: కోర్టులోనే పోట్లాడుకున్న టెన్నిస్‌ ఆటగాళ్లు

రష్యా, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ టెన్నిస్‌ ఆటగాళ్లు కోర్టులోనే గొడవకు దిగారు. దుర్భాషలాడుకుంటూ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.

Published : 01 Oct 2022 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్రెంచ్‌ టెన్నిస్‌ ఆటగాడు కోరెంటిన్‌ మౌటెట్‌, బల్గేరియాకు చెందిన ఆడ్రియన్‌ ఆండ్రీవ్‌ టెన్నిస్‌ కోర్టులోనే గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన ఓర్లియన్స్‌ ఛాలెంజర్‌ టోర్నమెంట్‌లో ఈ ఘటన జరిగింది. టోర్నీ 16వ రౌండ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు తలపడ్డారు. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంకులో ఉన్న మౌటెట్‌ను 247వ ర్యాంకులో ఉన్న ఆండ్రూ 2-6 7-6 (7-3) 7-6 (7-2) తేడాతో ఓడించాడు. అయితే, మ్యాచ్‌ అనంతరం కరచాలనం సమయంలో వీరిద్దరూ గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు స్వల్పంగా దాడిచేసుకున్నారు. ఛైర్‌ ఎంపైర్లు కలుగజేసుకోవడంతో దుర్భాషలాడుకుంటూ వారు కోర్టును వీడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఈ గొడవ అనంతరం మౌటెట్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. తాను క్షమాపణలు చెప్పదలుచుకోవడంలేదని స్పష్టం చేశాడు. ‘మ్యాచ్‌ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి క్షమాపణలు చెప్పాలనుకోవడంలేదు. నా కళ్లల్లోకి చూసుకుంటూ తీవ్రంగా దుర్భాషలాడాడు. అతడు అలా చేసుండకూడదు. అందుకే నాదైన రీతిలో సమాధానం చెప్పాను’ అంటూ పేర్కొన్నారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని