Bumrah : బుమ్రాకు టెస్టు క్రికెట్‌ చాలా తేలికగా అనిపిస్తోంది : అజిత్ అగార్కర్

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టుపై భారత్‌ పట్టు బిగించేలా చేయడంలో కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా ముఖ్యభూమిక పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో..

Published : 03 Jul 2022 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టుపై భారత్‌ పట్టు బిగించేలా చేయడంలో కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా ముఖ్యభూమిక పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో ధాటిగా 31 పరుగులు చేసిన బుమ్రా.. బౌలింగ్‌లో (3/35) ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర వహించాడు. ఈ క్రమంలో బుమ్రా ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు నాయకుడిగా అద్భుతంగా రాణించడం అభినందనీయమని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అజిత్ అగర్కార్ కొనియాడాడు. 

‘‘ఇదే సిరీస్‌లో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టులో భారత్‌ విజయానికి బుమ్రా, షమీ భాగస్వామ్యం కీలకం. ఇప్పుడు కూడా బుమ్రా చేసిన పరుగులు చాలా విలువైనవి. ఇంగ్లాండ్‌ పేసర్ స్టువర్ట్‌  బ్రాడ్‌కు కలిసిరాలేదు. దానిని బుమ్రా చక్కగా అందిపుచ్చుకున్నాడు. అందుకేనేమో బుమ్రాకు టెస్టు క్రికెట్‌ సులభంగా అనిపిస్తోంది’’ అని అజిత్‌ అగర్కార్‌ పేర్కొన్నాడు. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 38.5 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 416 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్‌ 84/5 స్కోరుతో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని