IND vs SA : పుజారాకు పక్కా స్కెచ్‌.. పీటర్సన్ సూపర్‌ క్యాచ్‌

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా..

Updated : 13 Jan 2022 18:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : దక్షిణాఫ్రికా బౌలర్ల పక్కా స్కెచ్‌కు భారత మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా (9) దొరికిపోయాడు. భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న ఆఖరి టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లపై సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. ఓవర్‌నైట్‌ 57/2 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ జాన్‌సెన్‌ వేసిన రెండో బంతికే పుజారా (9) అదనంగా పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా ఫీల్డర్‌ కీగన్ పీటర్సన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. 

మూడో రోజు ఆట ప్రారంభం కాగానే.. జాన్‌సెన్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతిని ఆడే క్రమంలో పుజారా విఫలమయ్యాడు. బంతి పుజారా గ్లౌజ్‌కు తాకి లెగ్‌సైడ్‌ వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్‌లో ఉన్న పీటర్సన్‌ ఎంతో చురుగ్గా కదిలి అద్భుతంగా బంతిని ఒడిసిపట్టాడు. దీంతో పుజారా పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన రహానె (1) కూడా ఔట్‌ కావడంతో భారత్‌ ఇబ్బందుల్లో పడింది. మరి పుజారా క్యాచ్‌ను మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని