Published : 16 Mar 2022 02:16 IST

IPL - 2022: టైటిల్‌ సాధించడమే మా ప్రథమ లక్ష్యం : రాహుల్ తెవాటియా

ఇంటర్నెట్ డెస్క్ : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌లో టైటిల్ సాధించడమే తమ ప్రథమ లక్ష్యమని గుజరాత్ టైటాన్స్‌ ఆటగాడు రాహుల్ తెవాటియా అన్నాడు. ఫినిషర్‌గా తమ జట్టు విజయం కోసం మరింత బాధ్యాతాయుతంగా రాణించాల్సిన అవసరం ఉందని అతడు పేర్కొన్నాడు. ఈ సీజన్‌ నుంచే.. గుజరాత్‌ టైటాన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. మార్చి 28న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచులో పోటీపడనున్నాయి.

‘ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా.. నా పాత్రలో ఎలాంటి మార్పు ఉండదు. మా జట్టులో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యతో పాటు నేను కూడా కీలకంగా రాణించాల్సిన అవసరం ఉంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాను. జట్టు విజయం కోసం శాయశక్తులా శ్రమిస్తాను. పొట్టి ఫార్మాట్లో లోయర్ ఆర్డర్‌లో సత్తా చాటడం చాలా కీలకం.  6, 7, 8 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగే ఆటగాళ్లు తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆఖర్లో మనం చేసే ఆ పరుగులే ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ఒకవేళ మేం తొలుత బ్యాటింగ్ చేస్తే.. ప్రత్యర్థి జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలగాలి. ఛేదనకు దిగితే లక్ష్యాన్ని బట్టి ధాటిగా ఆడాలి. టైటిల్ సాధించడం మా ప్రథమ లక్ష్యం. ఒకవేళ ఆడుతున్న తొలి సీజన్‌లోనే మేం ఛాంపియన్‌గా నిలిస్తే అంతకు మించిన సంతోషం మరోటి ఉండదనుకుంటున్నాను’ అని రాహుల్ తెవాటియా అన్నాడు. గతంలో ఇతడు.. రాజస్థాన్‌ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల తరఫున ఆడాడు. ఇటీవల జరిగిన వేలంలో రూ.9 కోట్ల భారీ మొత్తానికి రాహుల్ తెవాటియాను గుజరాత్‌ జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని