సైనా పరాజయం.. కిదాంబి వాకోవర్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల కథ ముగిసింది. కొందరు తొలి, రెండో రౌండ్లోనే పరాజయం పాలవ్వగా మరికొందరు ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో మధ్యలో తప్పుకున్నారు. యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 మహిళల రెండో రౌండ్లో సైనా నెహ్వాల్‌ ఓటమిపాలైంది....

Published : 15 Jan 2021 03:34 IST

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల కథ ముగిసింది. కొందరు తొలి, రెండో రౌండ్లోనే పరాజయం పాలవ్వగా మరికొందరు ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో మధ్యలో తప్పుకున్నారు. యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 మహిళల రెండో రౌండ్లో సైనా నెహ్వాల్‌ ఓటమిపాలైంది. స్థానిక షట్లర్‌, ప్రపంచ 12వ ర్యాంకర్‌ బుసానన్‌ చేతిలో 23-21, 14-21, 16-21 తేడాతో పోరాడి ఓడింది. దాదాపు 68 నిమిషాలు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థులిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్న మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ కిదాంబి శ్రీకాంత్‌ వాకోవర్‌ ప్రకటించాడు. మలేసియా ఆటగాడు లీ జి జియాతో అతడు తలపడాల్సింది. కుడికాలి పిక్క కండరాలు పట్టేయడంతో ఆట నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ 19-21, 17-21 తేడాతో ఇండోనేసియా ద్వయం మహమ్మద్‌ అహ్‌సన్‌, హెండ్రా సెతియవన్‌ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

చాలాకాలం తర్వాత బ్యాడ్మింటన్‌ కోర్టులో అడుగుపెట్టిన సైనా.. బుసానన్‌తో శక్తిమేరకు పోరాడింది. తొలిగేమ్‌ను బుసానన్‌ 3-0తో ఆరంభించగా సైనా పుంజుకొని 6-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగిన ప్రత్యర్థి విరామ సమయానికి 11-9తో ముందంజ వేసింది. 11-13 వద్ద ఉండగా సైనా మళ్లీ పుంజుకొని 17-17తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత సుదీర్ఘ ర్యాలీలతో 23-21తో సైనా తొలి గేమ్‌ను గెలుచుకుంది. అయితే రెండు, మూడో గేముల్లో బుసానన్‌ అద్భుతమైన నెట్‌గేమ్, క్రాస్‌కోర్టు షాట్లతో విరుచుకుపడి విజయం సాధించింది.

ఇవీ చదవండి
‘అశ్విన్‌ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’ 
వాహ్‌ అజహరుద్దీన్‌.. నువ్వెంతో గ్రేట్‌: సెహ్వాగ్‌

 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts