
Bravo: యువీ వికెట్ నా జీవితాన్నే మార్చేసింది: బ్రావో
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌ని ఔట్ చేయడంతో తన జీవితమే మారిపోయిందని వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో అన్నాడు. తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన అతడు 2006లో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు టీ20 లీగ్‌లో భాగంగా చెన్నై జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
జమైకాలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అదే మైదానంలో జరిగిన రెండో వన్డేలో 1 పరుగు తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఆ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భారత్ 1 పరుగు తేడాతో ఓటమి పాలైంది. టీమ్ఇండియా విజయానికి 10 పరుగులు అవసరమైన సమయంలో.. ఆఖరి ఓవర్లో రెండు, మూడు బంతులను యువరాజ్ సింగ్ బౌండరీకి తరలించి సమీకరణాన్ని మూడు బంతుల్లో రెండు పరుగులుగా మార్చేశాడు. కానీ, దురదృష్టవశాత్తు నాలుగో బంతికి యువరాజ్ బౌల్డయ్యాడు. దీంతో భారత్‌కి ఓటమి తప్పలేదు.
‘టీమ్ఇండియా అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయి.. విజయానికి రెండు పరుగుల దూరంలో ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువరాజ్ సింగ్ (93) ఉన్నాడు. అలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో అర్థం కాలేదు. ఆఖరికి డిప్పర్ బంతితో యువరాజ్‌ని ఔట్ చేయడంతో అందరి దృష్టి నాపై పడింది. ఆ ఒక్క బంతితో నా జీవితమే మారిపోయింది. నా టీ20 కెరీర్‌కు పునాదిగా నిలిచింది. నా జీవితాన్ని మలుపు తిప్పిన ఆ బంతే ఇప్పటికీ నా ఫేవరెట్’ అని డ్వేన్ బ్రావో చెప్పాడు.
2006లో కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా విండీస్‌తో ఐదు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచుల్లో తలపడింది. 1-4 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్‌ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: విమానప్రయాణంతో ఇబ్బంది పడ్డ విద్యార్థిని.. సాయం చేసిన కేంద్రమంత్రి
-
India News
Misleading Rahul video : న్యూస్ యాంకర్ అరెస్టుపై రెండు రాష్ట్రాల పోలీసుల వార్
-
Sports News
IND vs ENG : జాత్యహంకార వ్యాఖ్యల కలకలం.. స్పందించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
-
Business News
Passenger vehicle retail sales: పుంజుకున్న చిప్‌ల సరఫరా.. పెరిగిన వాహన విక్రయాలు!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Business News
ED raids against Vivo: దేశవ్యాప్తంగా వివో కార్యాలయాల్లో ఈడీ సోదాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
- Bumrah : బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. SENAపై అదరగొట్టేసిన టీమ్ఇండియా పేసర్