Sunil Gavaskar: ఆ విషయంలో అతడు ధోనీని గుర్తు చేస్తాడు : హార్దిక్‌ పాండ్యపై గావస్కర్‌ ప్రశంసలు

అరంగేట్ర సీజన్‌ నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది గుజరాత్‌ టైటాన్స్‌. ఆ జట్టు విజయాలకు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యానే కారణమని సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) ప్రశంసించాడు.

Published : 29 May 2023 13:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐపీఎల్‌(IPL) చరిత్రలో తొలిసారిగా ఓ ఫైనల్‌ మ్యాచ్‌ (IPL 2023 Final) రిజర్వ్‌డే (Reserve Day)కు చేరింది.  దీంతో ఆదివారం తీవ్ర నిరాశకు గురైన గుజరాత్‌(Gujarat Titans), చెన్నై(chennai super kings) జట్ల అభిమానులు.. సోమవారం జరిగే మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి కూడా కప్‌ గెలిచి వరుసగా రెండోసారి టైటిల్‌ విజేతగా నిలవాలని గుజరాత్‌ భావిస్తోంది. అరంగేట్ర సీజన్‌ నుంచి ఇప్పటి వరకూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న గుజరాత్‌ విజయాల వెనక ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య(Hardik Pandya) కృషి ఎంతో ఉందని మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) ప్రశంసించాడు.

కెప్టెన్సీ విషయంలో హార్దిక్‌ను ధోనీ(MS Dhoni)తో పోల్చుతూ గావస్కర్‌ మెచ్చుకున్నాడు. ‘గత ఏడాది తొలిసారి కెప్టెన్సీ చెపట్టినప్పుడు అతడిపై పెద్దగా అంచనాలు ఎవరికీ లేవు. అయితే.. అతడు ఎంత ఉత్తేజకరమైన ఆటగాడో ఏడాదికాలంగా చూస్తూనే ఉన్నాం. అతడు జట్టులోకి తీసుకువచ్చిన ప్రశాంతత.. ఎంఎస్‌ ధోనీని గుర్తు చేస్తుంది. ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన జట్టు. ఇలాంటి పరిస్థితులే మనం చెన్నై జట్టులో చూస్తాం. ఈ ఘనత హార్దిక్‌కే దక్కుతుంది’ అని గావస్కర్‌ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు.

ఇక హార్దిక్‌ కూడా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ధోనీని పొగుడుతూనే ఉంటాడు. ‘‘నిజంగా నేను ధోనీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడితో మాట్లాడకుండానే.. కేవలం చూస్తూనే చాలా సానుకూల అంశాలు నేర్చుకోవచ్చు. నాకైతే మహీ బెస్ట్‌ ఫ్రెండ్‌, ప్రియమైన సోదరుడు’ అంటూ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు ముందు హార్దిక్‌ అన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని