U19 World Cup : ఐసీసీ ‘అత్యంత విలువైన జట్టు’.. ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం

అండర్-19 ప్రపంచకప్‌ నెగ్గిన యువ భారత్‌ జట్టులోని పలువురు ఆటగాళ్లకు మరో అరుదైన గౌరవం దక్కింది. 

Published : 07 Feb 2022 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ప్రపంచకప్‌ నెగ్గిన యువ భారత్‌ జట్టులోని పలువురు ఆటగాళ్లకు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘అత్యంత విలువైన జట్టు’ను ఐసీసీ ప్రకటించింది. ఎనిమిది దేశాలకు చెందిన ఆటగాళ్లకు ఈ జట్టులో ప్రాతినిధ్యం దక్కింది. ఐసీసీ ప్రకటించిన 12 మంది క్రికెటర్లలో టీమ్‌ఇండియాకు చెందిన ముగ్గురు ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు. అంతేకాకుండా ఆ జట్టుకు యువ భారత్‌ సారథి యాష్ ధుల్‌ కెప్టెన్‌గా ఎంపిక కావడం మరో విశేషం.

ఐసీసీ వెల్లడించిన అత్యంత విలువైన జట్టులో భారత్‌ నుంచి యాష్‌ ధుల్, రాజ్‌ బవా, విక్కీ ఓస్వాల్‌ చోటు సంపాదించారు. మిగతావారిలో జోష్‌ బోయ్‌డెన్ (ఇంగ్లాండ్‌), అవాస్ అలీ (పాకిస్థాన్‌), రిపన్ మోండల్‌ (బంగ్లాదేశ్), టాప్‌ ప్రెస్ట్ (ఇంగ్లాండ్‌), దునిత్ వెల్లలాగె (శ్రీలంక) హషీబుల్లా ఖాన్‌ (పాకిస్థాన్), టీగ్‌ విల్లే (ఆస్ట్రేలియా), డేవాల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా), నూర్ అహ్మద్‌ (అఫ్గానిస్థాన్‌) ఉన్నారు. ఓపెనర్లుగా హసీబుల్లా ఖాన్‌, టీగ్‌ విల్లేను ఐసీసీ ఎంపిక చేసింది.  

అండర్‌-19 ప్రపంచకప్‌లో  ‘TOP 12’  ఆటగాళ్ల  ప్రదర్శన ఇలా.. 

* యాష్ ధుల్ (భారత్‌) : 229 పరుగులు 

* హషీబుల్లా (పాక్‌): 380 పరుగులు 

* టీగ్‌ విల్లే (ఆసీస్‌ వికెట్ కీపర్‌) : 278 పరుగులు  

* డేవిడ్ బ్రెవిస్‌(దక్షిణాఫ్రికా) : 506 పరుగులు, ఏడు వికెట్లు

* టామ్ ప్రెస్ట్‌ (ఇంగ్లాండ్‌) : 292 పరుగులు 

* దునిత్ వెల్లలాగె (శ్రీలంక): 264 పరుగులు, 17 వికెట్లు 

* రాజ్‌ బవా (భారత్‌) : 252 పరుగులు, 9 వికెట్లు 

* విక్కీ ఓత్సవాల్ (భారత్)‌: 12 వికెట్లు 

* రిపన్ మోండల్‌ (బంగ్లాదేశ్‌): 14 వికెట్లు 

* అవాస్ అలీ (పాక్‌) : 15 వికెట్లు 

* జోష్‌ బోయ్‌డెన్ (ఇంగ్లాండ్‌) : 15 వికెట్లు 

* నూర్ అహ్మద్ (అఫ్గాన్‌) : 10 వికెట్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని