Published : 17 Dec 2021 01:50 IST

BCCI-Virat Kohli: ఈ వివాదాల వల్ల నష్టపోయేది టీమ్‌ఇండియానే: ఆకాశ్ చోప్రా

ఇంటర్నెట్ డెస్క్: విరాట్‌ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగించిన అనంతరం భారత క్రికెట్‌లో నెలకొంటున్న పరిణామాలపై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి అనవసర వివాదాల కారణంగా భారత క్రికెట్ ప్రతిష్ట దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్నమొన్నటి వరకు రోహిత్‌ వర్సెస్‌ విరాట్‌గా ఉన్న పరిస్థితి.. ఇప్పుడు కోహ్లి వర్సెస్‌ బీసీసీఐగా మారింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తాను కోహ్లిని వ్యక్తిగతంగా కోరానని..  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అలాంటిదేమి జరగలేదని విరాట్ కొట్టిపారేశాడు.  టీ20 కెప్టెన్సీపై పునరాలోచన చేయాలని తనను ఎవరూ కోరలేదని దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో  కోహ్లి కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ మార్పుపై కూడా తనకు గంటన్నర ముందు సమాచారం ఇచ్చారని స్పష్టం చేశాడు. కోహ్లి చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ అంశంపై ఆకాశ్‌ చోప్రా మాట్లాడాడు. ఇలాంటి వివాదాలతో భారత క్రికెట్‌కు నష్టం వాటిల్లుంతుందన్నాడు.

‘ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారు? ఎవరు అబద్దం చెప్తున్నారు అనేది ప్రశ్నకాదు. అసలెందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయదే ప్రశ్న. ఎందుకుంటే ఇటువంటి వివాదాలతో నష్టపోయేది నువ్వో? నేనో.. ఇంకెవరో కాదు..  భారత క్రికెట్‌కే తీరని నష్టం జరుగుతుంది. నిజం కన్నా ఊహ బలంగా ఉంటుందనే లైన్ చదివి నేను కొంచెం ఆశ్చర్యపోయా. కానీ, ఇప్పుడు జరుగుతుందంతా చూస్తే అది నిజమే అనిపిస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు తాను సెలవే కోరలేదని విరాట్ కోహ్లి చెప్పాడు. కానీ రోహిత్ శర్మ‌ను కెప్టెన్ చేయగానే విరాట్ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. సమాచారలోపం వల్లే  ఇదంతా జరిగినట్లు అనిపిస్తోంది. అయితే ఈ పుకార్లు పుట్టిస్తుంది ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారనేది అర్థం కావడం లేదు’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

ఇలా చేయడం బాలేదు

రోహిత్‌ శర్మకి వన్డే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని తీసుకున్న నిర్ణయం భారత క్రికెట్‌కు లాభం చేకూర్చుతుందని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, కెప్టెన్సీ మార్పు విషయంలో కోహ్లితో చర్చించి ఉండాల్సిందన్నాడు.  ‘టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడే వన్డే, టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని విరాట్ కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లు తెలిపాడు. అయితే కెప్టెన్సీ అనేది హక్కు కాదు అదొక గౌరవం. దాన్ని హక్కుగా భావిస్తే గౌరవం దక్కదు. అయితే దేశానికి ఎన్నో విజయాలందించిన వంటి విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే ముందు అతనితో చర్చించాల్సింది. కేవలం సమాచారం ఇచ్చి ఇలా చేయడం బాలేదు' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని