Prithvi Shaw: అవసరం ఉన్నంత సేపే ప్రేమిస్తారు.. ఇన్‌స్టాలో పృథ్వీ షా ఎమోషనల్ పోస్ట్
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో (Team India) స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముంబయి (Mumbai)లోని ఓ ప్రముఖ హోటల్ వద్ద పృథ్వీ షా తన ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు యూట్యూబర్ సప్నాగిల్, ఆమె స్నేహితులు కొంతమంది పృథ్వీ షాపై దాడి చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షా ఫిర్యాదుతో సప్నాగిల్‌తోపాటు ఆమె స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చిన ఆమె.. తన మర్యాదకు భంగం కలిగించినందుకు గానూ పృథ్వీ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ముంబయి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఘటన తర్వాత పృథ్వీ షా పెద్దగా బయటికి రాలేదు. కానీ, తాజాగా అతడు ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఆ పోస్టును చూస్తే అతడిని ఎవరో మోసం చేసినట్లు అనిపిస్తోంది.
ఇంతకీ ఆ పోస్టు ఏముందంటే.. ‘కొంతమంది మనల్ని ప్రేమిస్తారు.. కానీ ఆ ప్రేమ వారికి మన అవసరం ఉండేవరకే. వారికి వచ్చే బెనిఫిట్స్ ఆగిపోతే అక్కడే వారి విధేయత కూడా ముగుస్తుంది’ అని పృథ్వీ షా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు. అతడు పెట్టిన ఈ పోస్టు అభిమానులను గందరగోళానికి గురిచేస్తోంది. కెరీర్ పరంగా పెట్టాడా లేదా లవ్ ఫెయిల్యూర్ వంటి కారణాలేమైనా ఉన్నాయా అని ఫ్యాన్స్ తికమకపడుతున్నారు. కొంతమంది నెటిజన్లు మాత్రం బీసీసీఐని టార్గెట్ చేసి ఈ పోస్టు పెట్టాడని భావిస్తున్నారు. పృథ్వీ షా భారత్ తరఫున చివరగా 2021 మేలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shah Rukh Khan: షారుఖ్ ఐకానిక్ పోజ్.. గిన్నిస్ రికార్డ్ వచ్చిందిలా
-
Crime News
Crime news: ఠాణే హత్య కేసు.. మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్‌లో సెర్చ్!
-
Politics News
Rahul Gandhi: గడ్డం పెంచుకుంటే ప్రధాని అయిపోరు: సామ్రాట్ చౌదరి
-
Movies News
Anasuya: విజయ్ దేవరకొండతో మాట్లాడటానికి ప్రయత్నించా: అనసూయ
-
Politics News
Siddaramaiah: సీఎం కుర్చీ సంతోషాన్నిచ్చే చోటు కాదు..: సిద్ధరామయ్య
-
General News
TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు