Tokyo Olympics: విజేతలారా.. ఉచితంగా ప్రయాణించండి

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు దేశీయ విమానయాన సంస్థలు స్టార్‌ ఎయిర్‌, గో ఫస్ట్‌ ప్రకటించాయి. జీవితకాలమంతా ఉచితంగా టికెట్లు అందజేస్తామని స్టార్‌ ఎయిర్‌ తెలపగా, ఐదేళ్లపాటు ఇస్తామని గో ఫస్ట్‌ వెల్లడించింది.

Published : 08 Aug 2021 16:17 IST

ప్రకటించిన స్టార్‌ ఎయిర్‌, గో ఫస్ట్‌ విమాన సంస్థలు

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు దేశీయ విమానయాన సంస్థలు స్టార్‌ ఎయిర్‌, గో ఫస్ట్‌ ప్రకటించాయి. జీవితకాలమంతా ఉచితంగా టికెట్లు అందజేస్తామని స్టార్‌ ఎయిర్‌ తెలపగా, ఐదేళ్లపాటు ఇస్తామని గో ఫస్ట్‌ వెల్లడించింది.  దేశానికి స్వర్ణాన్ని సాధించి పెట్టిన నీరజ్‌ చోప్రాకు ఏడాదిపాటు ఉచిత ప్రయాణ సేవలు అందజేస్తామని ఇండిగో సంస్థ శనివారమే ప్రకటించింది. ఈ సారి పతకాలు కైవసం చేసుకున్నవారిలో నీరజ్‌ చోప్రా(జావెలిన్‌ త్రో), పీవీ సింధు(బ్యాడ్మింటన్‌), మీరాబాయి చాను(వెయిట్‌ లిఫ్టింగ్‌), రవికుమార్‌ దహియా(రెజ్లింగ్‌), లవ్లీనా బొర్గొహెయిన్‌(బాక్సింగ్‌), బజరంగ్‌ పునియా(రెజ్లింగ్‌)తోపాటు హాకీ జట్టు ఉన్న విషయం తెలిసిందే.  ఒలింపిక్స్‌ ఛాంపియన్లకు ఉచిత సేవలు అందించడం గౌరవంగా భావిస్తున్నట్లు స్టార్‌ ఎయిర్‌ ఆదివారం తన ప్రకటనలో పేర్కొంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు