IND vs ENG: రహానె, ఇషాంత్‌ శర్మలను తీసేసి మంచి పని చేశారు..

గతేడాది టీమ్‌ఇండియా శిబిరంలో కొంతమందికి కరోనా సోకడంతో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య  జరగాల్సిన చివరి (ఐదో) టెస్టు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ ప్రస్తుతం రీ షెడ్యూల్‌ చేశారు. ఈ జులై 1 - 5 మధ్య ఆ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు.

Published : 06 Jun 2022 01:28 IST

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది టీమ్‌ఇండియా శిబిరంలో కొంతమందికి కరోనా సోకడంతో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య  జరగాల్సిన చివరి (ఐదో) టెస్టు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ ప్రస్తుతం రీ షెడ్యూల్‌ చేశారు. ఈ జులై 1 - 5 మధ్య ఆ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. ఇందుకు బీసీసీఐ భారత జట్టును ఇటీవలే ప్రకటించింది. టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు అయిన అజింక్యా రహానె, ఇషాంత్‌ శర్మలను సెలెక్టర్లు పక్కన పెట్టి యువ క్రికెటర్లు కేఎస్ భారత్, ప్రసిద్ధ్‌ కృష్ణలకు అవకాశం కల్పించారు. దీనిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ స్పందించాడు. వయసు ఎక్కువైన రహానె, ఇషాంత్‌ శర్మలను జట్టు నుంచి తొలగించి మంచి పని చేశారని బ్రాడ్ హాగ్‌ సెలెక్టర్లపై ప్రశంసలు కురిపించాడు. 

‘సెలెక్టర్లు అజింక్యా రహానె, ఇషాంత్ శర్మలను టెస్టు జట్టు నుంచి తొలగించడం గొప్ప విషయమని నేను భావిస్తున్నాను.  వారిద్దరి వయసు ఎక్కువైపోవడం వల్ల సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. మీరు (సెలెక్టర్లు) ఇలానే ముందుకు సాగండి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి వారిని రొటేట్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల యువ క్రికెటర్లు ఇప్పటికే అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కలిసి ఆడి అనుభవాన్ని పొందుతారు. శ్రేయస్ అయ్యర్.. విరాట్ కోహ్లీతో కలిసి మరికొన్నాళ్లు బ్యాటింగ్ చేయబోతున్నాడు. సుదీర్ఘకాలంపాటు ఫామ్‌లో ఉండటానికి అవసరమైన మెలకువలను నేర్చుకుంటాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమిలకు తోడుగా ప్రసిద్ధ్‌ కృష్ణ వస్తున్నాడు. ఆటగాళ్లను రొటేట్‌ చేయడం మంచి విధానం’ అని బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇక, ఈ సిరీస్‌ విషయానికొస్తే భారత్ 2-1 అధిక్యంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని