IND vs NZ: దంచికొట్టిన టీమ్‌ఇండియా బ్యాటర్లు.. కివీస్‌కు భారీ లక్ష్యం

మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో నెగ్గిన టీమ్‌ఇండియా.. ఆఖరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు 185 పరుగుల...

Updated : 21 Nov 2021 20:58 IST

అర్ధశతకం సాధించిన రోహిత్ శర్మ

కోల్‌కతా‌: మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో నెగ్గిన టీమ్‌ఇండియా.. ఆఖరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (56: ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఈ సిరీస్‌లో వరుసగా రెండో అర్ధశతకం నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న  మూడో టీ20 మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన రోహిత్ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

కేఎల్‌ రాహుల్‌ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్ (29: ఆరు ఫోర్లు) ధాటిగానే బ్యాటింగ్ చేశాడు. రోహిత్-ఇషాన్‌ కలిసి తొలి వికెట్‌కు అర్ధశతక (69) భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఇషాన్‌తోపాటు సూర్యకుమార్‌ (0), రిషభ్‌ పంత్ (4) స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్ (25)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యత్నించాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో 26వ అర్ధశతకం సాధించాడు. రోహిత్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెంకటేశ్‌ అయ్యర్ (20) వేగంగా పరుగులు చేశాడు. అయితే శ్రేయస్‌, వెంకటేశ్‌ వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో హర్షల్‌ పటేల్ (18: రెండు ఫోర్లు, ఒక సిక్స్‌), దీపక్‌ చాహర్ (21*: 2 ఫోర్లు, ఒక సిక్స్) ధాటిగా ఆడాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. కివీస్‌ బౌలర్లలో సాంట్నర్ 3.. ట్రెంట్ బౌల్ట్, మిల్నే, ఫెర్గూసన్, సోధీ తలో వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని