IND vs SA : టీ బ్రేక్‌.. సత్తా చాటిన టీమ్‌ఇండియా బౌలర్లు

భారత బౌలర్లు సరైన సమయంలో విజృంభించారు. మ్యాచ్‌పై పట్టు కోల్పోకుండా..

Updated : 12 Jan 2022 18:50 IST

రెండో సెషన్‌ ముగిసేసరికి దక్షిణాఫ్రికా 176/7

ఇంటర్నెట్ డెస్క్‌ : భారత బౌలర్లు సరైన సమయంలో విజృంభించారు. మ్యాచ్‌పై పట్టు కోల్పోకుండా చూస్తున్నారు. రెండో రోజు తొలి సెషన్‌లో కేవలం రెండు వికెట్లను పడగొట్టిన బౌలర్లు.. రెండో సెషన్‌లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. ప్రస్తుతం టీ బ్రేక్‌ సమయానికి దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజ్‌లో కీగన్‌ పీటర్సెన్ (70*) ఉన్నాడు. లంచ్‌ సమయం (100/3) తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఉమేశ్‌ యాదవ్‌ దెబ్బ కొట్టాడు. డస్సెన్ (21) కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే తర్వాత వచ్చిన బవుమా (28) నిలకడగా ఆడాడు. పీటర్సెన్‌తో కలిసి 47 పరుగులు జోడించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షమీ విడగొట్టాడు. ఒకే ఓవర్‌లో బవుమాతోపాటు వెరైన్‌ (0)ను ఔట్‌ చేసి టీమ్‌ఇండియాను రేసులో నిలబెట్టాడు. సెషన్‌ ఆఖర్లో జాన్‌సెన్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇంకా దక్షిణాఫ్రికా 47 పరుగులు వెనుకబడి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని