Ind vs Ban: బంగ్లాతో టెస్టు సిరీస్‌.. రోహిత్‌ స్థానంలో ఇండియా-ఎ ఆటగాడు

గాయం కారణంగా బంగ్లాతో సిరీస్‌కు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit sharma) స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. 

Updated : 08 Dec 2022 15:49 IST

దిల్లీ: బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(Rohit sharma) బొటనవేలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాతో జరగనున్న మూడో వన్డే (Ind vs Ban 2022)కు దూరమయ్యాడు. చట్టోగావ్‌ వేదికగా డిసెంబర్‌ 14న ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ రోహిత్‌ ఆడటం లేదు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న ఇండియా-ఎ జట్టు కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌(Abhimanyu easwaran) రోహిత్‌కి బదులు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ వ్యవహరిస్తాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్‌ వైస్ కెప్టెన్‌. 

‘‘అభిమన్యు ఈశ్వరన్‌ ప్రస్తుతం జరుగుతున్న ఇండియా- ఎ టెస్టు మ్యాచ్‌లో రెండు వరుస శతకాలను నమోదు చేశాడు. ఓపెనర్‌గానూ ఆడుతున్నాడు. సిల్‌హట్‌లో అతడు తన రెండో టెస్టు మ్యాచ్‌ను ముగించిన తర్వాత చట్టోగావ్కు వచ్చే అవకాశం ఉంది’’ అంటూ బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

ఈశ్వరన్‌ తొలి A టెస్టులో 141 పరుగులు చేశాడు. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి  నాటౌట్‌గా 144 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. అయితే, ఇదే జట్టు నుంచి బెంగాల్‌ సీమర్‌ ముఖేశ్‌ కుమార్‌కు అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. బంగ్లాతో మ్యాచ్‌లో గాయపడిన మహమ్మద్‌ షమీ స్థానాన్ని ముఖేశ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశాలున్నాయి.  గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధిస్తేనే రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ రాకపోతే మాత్రం అక్షర్ పటేల్‌కు బ్యాకప్‌గా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా సౌరభ్‌ కుమార్‌ టెస్టు జట్టులో చేరొచ్చు. ఈ సారి కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని సెలక్టర్లు భావిస్తే మాత్రం సూర్యకుమార్‌కు ఆ స్థానం దక్కే అవకాశం కనపడుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని