ICC Chairmanship: ఐసీసీ ఛైర్మన్‌గిరి.. సౌరభ్ గంగూలీ కామెంట్ ఇదే..!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌ రేసులో ప్రస్తుత భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఉన్నట్లు కొన్ని రోజులుగా...

Published : 23 Sep 2022 02:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌ పదవి రేసులో ప్రస్తుత భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్‌క్లే పదవీ కాలం అక్టోబర్‌ చివరి నాటికి ముగిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రయ ప్రారంభం కానుంది. 16 మంది సభ్యులు కలిగిన బోర్డులో.. పోటీ పడే అభ్యర్థుల్లో ఎవరికి తొమ్మిది ఓట్లు వస్తాయో వారే విజేతలుగా నిలిచి ఛైర్మన్‌ అవుతారు. కొత్తగా ఎన్నికైన వారు డిసెంబర్‌ 1 నుంచి 2024 నవంబర్‌ 20వ తేదీ వరకు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 

బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ పదవీ కాలం కూడా త్వరలోనే ముగియనుంది. అయితే వరుసగా రెండోసారి అధ్యక్షుడి ఎన్నిక కావడం కూడా లాంఛనమే. కానీ గంగూలీ మాత్రం ఐసీసీ ఛైర్మన్‌ కుర్చీపై ఆసక్తిగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో స్వయంగా గంగూలీనే స్పందించాడు. ‘‘ఐసీసీ ఛైర్మన్‌షిప్‌ అనేది నా చేతుల్లో లేదు’’ అని వ్యాఖ్యానించాడు. అలాగే టీమ్‌ఇండియా సీనియర్‌ మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి రిటైర్‌మెంట్‌పై గంగూలీ మాట్లాడుతూ.. ‘‘ఝులన్‌ దిగ్గజ మహిళా క్రికెటర్‌. అద్భుతమైన కెరీర్‌కు ముగింపు ఇవ్వనుంది. భారత మహిళల క్రికెట్‌ చరిత్రలో ఝులన్ ప్రత్యేక గుర్తింపు పొందింది. యువతకు ఆదర్శంగా మారింది. ఆమె ఒక ఛాంపియన్‌’’ అని ప్రశంసించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని