Shubman Gill: హార్దిక్.. నువ్వు చెప్పిందే చేశా: శుభ్‌మన్ గిల్
న్యూజిలాండ్‌తో మూడో టీ20 ఆడుతున్న సమయంలో హార్దిక్ పాండ్య ఇచ్చిన సూచనను శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో తానెంతో వ్యూహాత్మకంగా ఆడానని తెలిపాడు.
ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 168 పరుగుల భారీ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు శుభ్‌మన్‌గిల్ (126*) శతకంతో చెలరేగాడు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్య 4 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం హార్దిక్-గిల్ మధ్య ఓ సరదా ఇంటర్వ్యూ జరిగింది. తన బ్యాటింగ్ సమయంలో హార్దిక్ పాండ్య ఇచ్చిన సలహాను గిల్ బయటపెట్టాడు. దీనికి సంబంధించి వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
‘‘నేను సిక్సర్ బాదిన ప్రతిసారీ నువ్వు వచ్చి ‘ఆ తర్వాతి షాట్ ఎలా ఆడాలనుకుంటున్నావో నిర్ణయించుకో. అదనంగా ఏమీ చేయొద్దు. నీ ఆట నువ్వు ఆడు అన్నావ్’ అది నాకు చాలా ఉపయోగపడింది’’ అని హార్దిక్‌ను ఉద్దేశించి గిల్ అన్నాడు. ఈ ఇన్నింగ్స్ వ్యూహాత్మకంగా, టెక్నికల్‌గా నాకు సరైందని వివరించాడు. ఇక హార్దిక్ మాట్లాడుతూ.. ‘‘నాలుగు వికెట్లు తీయడం ఆటలో ఒక భాగం మాత్రమే. నేను 145కి.మీ. (kmph) వేగంతో బౌలింగ్ చేశానని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ తర్వాత విరామం తీసుకుంటున్నా కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించాలని అనుకున్నా. అందుకే అంత వేగంగా బంతుల్ని విసిరా. మ్యాచ్ ఆరంభం గొప్పగా ఉంది. అది విజయాన్ని సులభం చేసింది’’ అని హార్దిక్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్‌నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ ఒకటి. లఖ్‌నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్‌గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్‌కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్‌కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్‌కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్