BAN vs ENG: దీనికెందుకు డీఆర్‌ఎస్‌..? ఇదో చెత్త నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌పై ఫ్యాన్స్‌ ఫైర్

క్రికెట్‌లో కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి వైరల్‌గా మారిపోతుంటాయి. తాజాగా ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌లోనూ ఇలాంటి సంఘటనే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Updated : 04 Mar 2023 18:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌లకు (DRS) ఉన్న విలువ ప్రతి క్రికెటర్‌కూ తెలుసు. అంపైర్‌ నుంచి తమకు అనుకూలంగా ఫలితం రానప్పుడు వెంటనే సమీక్షను కోరుతుంటారు. కాస్త అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఇలా డీఆర్‌ఎస్‌ను తీసుకుంటూ ఉంటారు. అది పక్కాగా నాటౌట్‌ అని తెలిసినా ఫీల్డింగ్‌ జట్టు డీఆర్‌ఎస్‌ను తీసుకుంటే మాత్రం.. కీలకమైన బ్యాటర్‌ గురించి అనుకోవచ్చు. కానీ, క్రీజ్‌లో ఉన్నది సాధారణమైన ఆటగాడు.. అయినా ఇంకా మూడు ఓవర్ల ఆట మాత్రమే ఉండటంతో బంగ్లాదేశ్‌ (Bangladesh) కెప్టెన్‌ తీసుకున్న డీఆర్‌ఎస్‌ నిర్ణయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇంగ్లాండ్‌ - బంగ్లాదేశ్‌ (ENG vs BAN) జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్‌ (ODI Series) జరుగుతోంది. వరుసగా రెండు వన్డేలను గెలిచిన ఇంగ్లాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, రెండో వన్డే సందర్భంగా బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ 47.6వ ఓవర్‌లో తీసుకున్న డీఆర్‌ఎస్ నిర్ణయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. టస్కిన్ అహ్మద్‌ వేసిన ఆ ఓవర్‌ చివరి బంతిని ఇంగ్లాండ్‌ బ్యాటర్ అదిల్ రషీద్ అడ్డుకున్నాడు. బ్యాట్‌ను బంతిని తాకినట్లు స్పష్టంగా కనిపించినా.. టస్కిన్‌ అహ్మద్‌ ఔట్‌ కోసం పెద్దగా అప్పీలు చేశాడు. అంపైర్‌ దానిని నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ, కెప్టెన్ తమీమ్‌ మాత్రం వెంటనే రివ్యూ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తీరా, రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది. ఇప్పుడిదే సోషల్‌ మీడియాలో మీమ్స్‌గా మారిపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని