Tilak Varma: ‘తిలక్‌ వర్మకు ఇది అద్భుతమైన అవకాశం.. భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడతాడు’

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టి ఆసియా కప్‌నకు ఎంపికైన తిలక్ వర్మ (Tilak Varma) పై భారత మాజీ ఆటగాడు సబా కరీం ప్రశంసలు కురిపించాడు.

Published : 25 Aug 2023 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున అదరగొట్టి ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లోనూ సత్తాచాటాడు. ఫలితంగా వన్డేల్లోనూ టీమ్‌ఇండియా (Team India) తరఫున ఆడే ఛాన్స్‌ కొట్టేశాడు. ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌ (Asia Cup 2023) జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మపై భారత మాజీ ఆటగాడు సబా కరీం ప్రశంసలు కురిపించాడు. సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు తిలక్‌ వర్మపై నమ్మకం ఉంచారని, భవిష్యత్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా అతడికి ఉందని సబా కరీమ్‌ అభిప్రాయపడ్డాడు. 

చెస్‌ వరల్డ్ కప్‌ విజేతగా కార్ల్‌సన్‌.. ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి

‘‘కొన్నిసార్లు సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత మద్దతు ఇవ్వొచ్చు. ఆటగాడిని టీ20 ఫార్మాట్ నుంచి వన్డేలకు ఎంపిక చేస్తే ఎలాంటి నష్టం ఉండదు. తిలక్‌ వర్మకు లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ విషయం మర్చిపోకూడదు. 25 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో అతడి సగటు 50 కంటే ఎక్కువగా ఉంది. అంటే వన్డేల్లో ఎలా ఆడాలో అతడికి తెలుసు. తిలక్ వర్మకు ఉన్న అనుభవంతో  టీ20 క్రికెట్ వాతావరణం నుంచి వన్డే క్రికెట్‌కు మారడానికి ఎక్కువ సమయం పట్టదు. డ్రెస్సింగ్ రూమ్‌ వాతావరణం అలవాటు పడటానికి, అంతర్జాతీయ క్రికెట్‌లోని చిక్కులను అర్థం చేసుకోవడానికి, విభిన్న పరిస్థితుల్లో ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలను తెలుసుకోవడానికి తిలక్‌ వర్మకు ఇది అద్భుతమైన అవకాశం. అతడు టీ20ల్లో రాణించడంతో సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచి ఆసియా కప్‌నకు ఎంపిక చేశాయి. ఇవన్నీ తిలక్ వర్మ భవిష్యత్తులో అన్ని ఫార్మాట్ల ఆటగాడిగా మారతాడని స్పష్టం చేస్తున్నాయి’’ అని సబా కరీం వెల్లడించాడు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు