WTC Final: పంత్‌ క్యాచ్‌ చేజారడంతో భయమేసింది

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ క్యాచ్‌ వదిలేసినప్పుడు మ్యాచ్‌ చేజారిపోతుందని భయపడ్డానని న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అన్నాడు. అప్పటికే మ్యాచ్‌ అత్యంత కఠినంగా సాగుతోందని పేర్కొన్నాడు. పంత్‌కు ఐదారు ఓవర్లలోనే మ్యాచును మలుపు తిప్పగల..

Published : 02 Jul 2021 01:19 IST

న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ క్యాచ్‌ వదిలేసినప్పుడు మ్యాచ్‌ చేజారిపోతుందని భయపడ్డానని న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అన్నాడు. అప్పటికే మ్యాచ్‌ అత్యంత కఠినంగా సాగుతోందని పేర్కొన్నాడు. పంత్‌కు ఐదారు ఓవర్లలోనే మ్యాచును మలుపు తిప్పగల సామర్థ్యం ఉందని వెల్లడించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ ఐదు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. కైల్‌ జేమీసన్‌ వేసిన 40వ ఓవర్‌ ఆఖరి బంతి పంత్‌ బ్యాటు అంచుకు తగిలి స్లిప్‌లోకి వెళ్లింది. అప్పుడు రెండో స్లిప్‌లో ఉన్న సౌథీ ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డర్‌ ముందు కుడివైపు డైవ్‌ చేశాడు. కానీ బంతి అతడి చేజారింది.

‘ఆ  క్యాచ్‌ గురించి నేను బాధపడలేదంటే అవాస్తవమే అవుతుంది. ఎందుకంటే పంత్‌ ఎంత విధ్వంసకరంగా ఆడతాడో అందరికీ తెలుసు. అతడు ఐదారు ఓవర్లలో మ్యాచును మన నుంచి లాగేసుకోగలడు. అప్పటికే మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. నా బుర్రలో ఎన్నో చెడు ఆలోచనలు తిరిగాయి. కానీ తర్వాతి ఓవర్‌ వేయాలంటే వాటి గురించి పట్టించుకోవద్దు. ఆ తర్వాత పంత్‌ ఔటయ్యాక ఊపిరి పీల్చుకున్నా’ అని సౌథీ అన్నాడు. 

‘అదో భయంకరమైన అనుభవం. క్యాచులు వదిలేయడం క్రికెటర్‌ కెరీర్‌లోనే ఘోరమైంది. అలా చేయడం మన సహచరులను అవమాన పరిచినట్టే అనిపిస్తుంది’ అని సౌథీ తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసింది పంత్‌ (41) అన్న సంగతి తెలిసిందే. అతడు మరో గంటసేపు నిలిచుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు