Published : 10 Feb 2022 13:45 IST

Deepak Hooda : నా చిన్ననాటి కల.. ఇప్పుడు నెరవేరింది : దీపక్‌ హుడా

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ జట్టులోకి రావాలనేది ప్రతి క్రికెటర్ కల. అలాంటి అవకాశం విండీస్‌తో సిరీస్‌ సందర్భంగా తొలి మ్యాచ్‌లోనే దీపక్‌ హుడాకు దక్కింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో దీపక్‌ హుడా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 26* పరుగులు చేసి తనేంటో నిరూపించుకున్నాడు. ఇక రెండో వన్డేలోనూ జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలకమైన 29 పరుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ మెరిసి అంతర్జాతీయ కెరీర్‌లో తొలి వికెట్‌ను సాధించాడు. అది కూడా ప్రమాదకరంగా మారుతున్న విండీస్‌ బ్యాటర్‌ బ్రూక్స్ (44) వికెట్‌ కావడం విశేషం. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో  కైవసం చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం దీపక్‌ హుడాను సూర్యకుమార్‌ యాదవ్‌ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (64) టాప్‌ స్కోరర్.

ఈ సందర్భంగా దీపక్ హుడా తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. ‘‘విండీస్‌తో తొలి వన్డేలో అరంగేట్రం చేయడం అద్భుతమైన ఫీలింగ్. దాని కోసం ఎంతో కష్టపడ్డా. ఆ మ్యాచ్‌కు ముందు కూడా నీతో (సూర్యకుమార్‌తో) మాట్లాడాను. నా చిన్నప్పటి నుంచి ఒకటే కల. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు ఎంఎస్‌ ధోనీ లేదా విరాట్ కోహ్లీ చేతుల మీదుగా క్యాప్‌ను అందుకోవాలనేది నా కల. ఇప్పుడు కోహ్లీ క్యాప్‌ను అందించడం మరిచిపోలేని సందర్భం. నేను ఇతర అంశాలను పక్కన పెట్టేసి ఎంపిక కావడంపైనే దృష్టిసారించా’’ అని సూర్యకుమార్‌తో దీపక్ హుడా చెబుతున్న వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts