IND vs AUS: మూడు టెస్టుల్లో మూడు సార్లు కోహ్లీ వికెట్‌.. అదొక అద్భుతం: మర్ఫీ

స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీని (Virat Kohli) ఔట్‌ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, ఒకే సిరీస్‌లో మూడుసార్లు పెవిలియన్‌కు చేర్చాడు ఓ యువ బౌలర్‌.  

Published : 07 Mar 2023 19:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) మూడు టెస్టులు ముగిశాయి. భారత్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీని (IND vs AUS) ఆసీస్‌ యువ బౌలర్‌ టాడ్‌ మర్ఫీ మూడుసార్లు ఔట్‌ చేయడం గమనార్హం. దిగ్గజ బ్యాటర్‌ను ఇలా బోల్తా కొట్టించడం సాధారణ విషయమేం కాదు. గత ఆరు నెలల్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులు మినహా మిగతా రెండు ఫార్మాట్లలో సెంచరీల నిరీక్షణకు తెరదించాడు. వన్డే, టీ20ల్లో ఫామ్‌ అందుకున్న విరాట్.. టెస్టుల్లో మాత్రం మునుపటి వేగాన్ని అందుకోలేకపోయాడు. యువ బౌలర్‌ బౌలింగ్‌లోనే మూడుసార్లు ఔట్‌ కావడంపై ఇటు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. టాడ్‌ మర్ఫీ (Todd Murphy) మాత్రం ఆనందంలో మునిగిపోయాడు. 

‘‘నా జీవితంలో ఇదొక అద్భుతమైన సంఘటన. నాగ్‌పుర్‌ టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ వచ్చేటప్పుడు నా మనస్సులో ఒకటే అనుకున్నా. ‘అతడిని ఔట్‌ చేస్తే బాగుంటుంది’’ అని అనుకుని  బౌలింగ్‌ చేశా. మూడు టెస్టుల్లో మూడుసార్లు ఔట్‌ చేయడం అద్భుతం. ఇలాంటి యుద్ధాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తా. బ్యాటర్లను బట్టి బౌలింగ్‌ వేయడంలో వ్యత్యాసం ఏమీ ఉండదు. నాగ్‌పుర్‌ టెస్టులో ముందే అనుకుని ఔట్‌ చేయలేదు. అయితే, వికెట్‌ దక్కడం మాత్రం ఆనందంగా ఉంది.పెద్ద స్టేడియంలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా. ఇలాంటి అవకాశం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చేస్తుంటారు. భారీ ప్రేక్షక సందోహం ముందు ఆడటం అనిర్వచనీయం. స్వదేశంలోనూ ఇంతమంది ముందు ఎప్పుడూ ఆడలేదు. అందుకే ఎంతో ఉత్సుకతతో ఉన్నా’’ అని మర్ఫీ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు