
Neeraj Chopra: లంచ్ బ్రేక్‌కి వెళ్లినప్పుడు ఆ విషయం తెలిసింది: జస్ప్రీత్ బుమ్రా
ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నీరజ్ చోప్రాను అభినందించాడు. అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా తొలి టెస్టు ఆడుతోంది. ఈ క్రమంలో నాలుగో రోజు మధ్యాహ్నాం భోజన విరామ సమయంలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడనే విషయం తెలిసిందని బుమ్రా పేర్కొన్నాడు.
‘దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనేదే గొప్ప ఘనత. అలాంటిది ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో బంగారు పతకం సాధించడం, అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇది మొదటి పతకం. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. చోప్రా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం’ అని బుమ్రా అన్నాడు.
ఇక, ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో రవి దహియా(రజతం), ఇదే విభాగంలో బజరంగ్ పునియా( కాంస్యం), వెయిట్ లిప్టింగ్లో మీరాబాయి చాను(రజతం), హాకీలో పురుషుల జట్టు (కాంస్యం), బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు(కాంస్యం), బాక్సింగ్‌లో లవ్లీనా (కాంస్యం),పతకాలను సాధించారు.