Tokyo Paralympics: క్వారంటైన్‌లోకి మరియప్పన్‌ తంగవేలు.. పతాకధారిగా టెక్‌ చంద్

టోక్యో పారాలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో భారత పతాకధారిగా టెక్‌చంద్‌ను ఎంపికయ్యాడు. ఇంతకుముందు ఈ బాధ్యతను రియో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలుకు అప్పగించగా...

Published : 24 Aug 2021 15:38 IST

(Photo: Mariyappan Thangavelu Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో పారాలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో భారత పతాకధారిగా టెక్‌చంద్‌ ఎంపికయ్యాడు. ఇంతకుముందు ఈ బాధ్యతను రియో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలుకు అప్పగించగా ఇప్పుడతను క్వారంటైన్‌లోకి వెళ్లాడు. టోక్యోకు వెళ్లేటప్పుడు విమానంలో ఓ కరోనా పాజిటివ్‌ వ్యక్తితో మరియప్పన్‌, మరో ఐదు మంది భారత అథ్లెట్లు సన్నిహితంగా మెలగడంతో నిబంధనల ప్రకారం అందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. దీంతో ప్రారంభ వేడుకలకు భారత పతకధారిగా అధికారులు టెక్‌చంద్‌ను ఎంపికచేశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం భారత ఒలింపియన్‌ బృందం ట్విటర్‌లో వెల్లడించింది. అయితే, క్వారంటైన్‌లోకి వెళ్లినవారందరికీ కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా తేలిందని చెప్పారు. త్వరలోనే వారికి ప్రాక్టీస్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఈ పారాలింపిక్స్‌కు భారత్‌ నుంచి మొత్తం 54 మంది అథ్లెట్ల బృందం ఇటీవలే టోక్యోకు వెళ్లింది. గత పారాలింపిక్స్‌లో నాలుగు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈసారి మరిన్ని ఎక్కువే సాధిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇక ఈరోజు ప్రారంభమయ్యే టోక్యో పారాలింపిక్స్‌ సెప్టెంబర్‌ 5 వరకు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని