Bhavina Patel: లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా: భవీనా పటేల్

పారాలింపిక్స్‌లో భవీనా పటేల్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. టేబుల్ టెన్నిస్‌లో భవీనా.. రజత పతకం

Updated : 29 Aug 2021 14:02 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో భవీనా పటేల్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. టేబుల్ టెన్నిస్‌లో భవీనా.. రజత పతకం సాధించి చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్, చైనా క్రీడాకారిణి యింగ్ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. పతకం సాధించిన అనంతరం భవీనా పటేల్ మాట్లాడారు.

‘నా ప్రదర్శనపై  కొద్దిగా నిరాశతో ఉన్నా. ఎందుకంటే ఈ రోజు నా స్థాయి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయా.  కానీ, వచ్చే టోర్నమెంట్‌లో ఈ లోపాలను సరిదిద్దుకుంటా. ఏ అథ్లెట్ అయినా వంద శాతం ప్రదర్శన ఇస్తే ఓడిపోరు అని నేను నమ్ముతా. నాకు ఎదురయ్యే సమస్యలతో  నేనెప్పుడూ కుంగిపోను. ఎందుకంటే ఒక దారి మూసుకుపోతే... భగవంతుడు మరిన్ని అవకాశాలు ఇస్తాడని నమ్ముతా’ అని భవీనా అన్నారు.

‘సమస్యలను సానుకూల కోణంలో చూడటం నేర్చుకున్నా. కష్టపడి పనిచేయడానికి ఈ ఆలోచనా విధానమే నాకు ధైర్యాన్నిస్తుంది. టోక్యో పారాలింపిక్స్‌ నుంచి చాలా నేర్చుకున్నా. ఇది గొప్ప అనుభూతి. వచ్చే పారాలింపిక్స్‌లో కచ్చితంగా వంద శాతం మెరుగైన ప్రదర్శన ఇస్తా. ఆసియా గేమ్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. భారత్‌కు చేరుకోగానే సాధన ప్రారంభిస్తా. పారాలింపిక్స్‌లో పొందిన అనుభవాలను భవిష్యత్తులో పాల్గొనే ప్రధాన టోర్నమెంట్‌లలో నా తప్పులను సరిదిద్దుకోవడానికి ఉపయోగిస్తా’ అని భవీనా పటేల్ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు