Tokyo Olympics: టోక్యోలో ఒక్కరోజే పెరిగిన కరోనా కేసులు

అనుకున్నట్టే జరుగుతోంది! టోక్యో నగరంలో కొవిడ్‌-19 కేసులు సంఖ్య పెరుగుతోంది. ఒలింపిక్స్‌ క్రీడల ప్రభావం కనిపిస్తోంది! మంగళవారం 2,848 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 7న నమోదైన అత్యధిక కేసులు 2,520 కన్నా ఈ సంఖ్య ఎక్కువే కావడం గమనార్హం...

Published : 27 Jul 2021 16:03 IST

టోక్యో: అనుకున్నట్టే జరుగుతోంది! టోక్యో నగరంలో కొవిడ్‌-19 కేసులు సంఖ్య పెరుగుతోంది. ఒలింపిక్స్‌ క్రీడల ప్రభావం కనిపిస్తోంది! మంగళవారం 2,848 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 7న నమోదైన అత్యధిక కేసులు 2,520 కన్నా ఈ సంఖ్య ఎక్కువే కావడం గమనార్హం. గతేడాది మహమ్మారి మొదలైయ్యాక నగరంలోని మొత్తం కేసులు 2 లక్షలకు చేరుకున్నాయి.

ఒలింపిక్స్‌ నిర్వహించడం వల్ల అతివేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియెంట్‌ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. యువకులు, టీకాలు తీసుకోని వారు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారని వివరించారు. 50 ఏళ్లు పైబడిన వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో చేరిన 3000 మందిలో వీరి వాటానే ఎక్కువ. ఈ నేపథ్యంలో నగరంలోని ఆసుపత్రుల్లో 3000గా ఉన్న పడకల సామర్థ్యాన్ని 6000కు పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జపాన్‌లో కరోనా టీకా పంపిణీ నత్తనడకన సాగుతోంది.  కాగా దేశంలో ఇప్పటి వరకు 25.5% మంది పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నారని ప్రభుత్వం చెబుతోంది.

జపాన్‌లో ఇప్పటి వరకు 8,70,445 కేసులు నమోదు అయ్యాయి. 15,129 మంది మృతిచెందారు. పౌరుల ఆరోగ్యం కన్నా ఒలింపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ప్రధాని యోషిహిదె సుగా ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని