Rahul Dravid-AShwin: ద్రవిడ్‌ కోచింగ్‌పై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం : అశ్విన్‌ 

ఇటీవల టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌ శైలిపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అతడు ఎంతో మంది యువ క్రికెటర్లను..

Published : 18 Nov 2021 19:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌ శైలిపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అతడు ఎంతో మంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడని పేర్కొన్నాడు. ‘రాహుల్ ద్రవిడ్‌ కోచింగ్‌ శైలిపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. అండర్‌-19 క్రికెట్‌ ద్వారా అతడు ఎంతో మంది నాణ్యమైన యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు. సీనియర్‌ జట్టును కూడా అలాగే తయారు చేస్తాడనుకుంటున్నా. అతడి రాకతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో సందడి వాతావరణం నెలకొంది’ అని అశ్విన్‌ చెప్పాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. మరోవైపు, టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి నుంచి తప్పుకోవడంతో.. రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌ పగ్గాలందుకున్నాడు. 
 
న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ గురించి అశ్విన్‌ మాట్లాడుతూ..‘న్యూజిలాండ్ 170-180 మధ్య స్కోరు చేస్తుందనుకున్నాం. అయితే, 15 వ ఓవర్‌ నుంచి ఆట మారిపోయింది. మేం కట్టుదిట్టంగా బంతులేయడంతో కివీస్‌ను కాస్త తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగాం. జైపుర్‌ పిచ్‌పై ఎంత నెమ్మదిగా బంతులేస్తే అంత విజయవంతమవుతాం. రెండో ఇన్నింగ్స్‌లో సాంట్నర్‌ ఇదే ట్రిక్‌ను అమలు చేశాడు ’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.  

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని