Published : 15 May 2022 01:46 IST

T20 League : ట్రెంట్‌ బౌల్ట్‌పై ప్రాంక్‌.. పగలబడి నవ్విన జట్టు సభ్యులు.. వీడియో చూడండి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజా టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ జట్టు సమిష్టిగా రాణిస్తోంది. 12 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రేపు లఖ్‌నవూతో తదుపరి మ్యాచ్‌ జరగనుండగా.. జట్టు సభ్యులు డ్రెస్సింగ్‌ రూంలో సరదాగా గడిపారు. పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌పై ప్రాంక్‌ చేసి ఓ ఆటాడుకున్నారు. రాజస్థాన్‌ సోషల్‌ మీడియా విభాగం బౌల్ట్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా యువ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌తోపాటు డెరిల్‌ మిచెల్‌, జేమ్స్‌ నీషమ్‌ అక్కడ ఓ వాతావరణాన్ని సృష్టించారు. కెమెరాలు పెట్టించి సోషల్‌ మీడియా విభాగం సభ్యుడితో ఇంటర్వ్యూ చేయించారు. అయితే ఇదంతా తెలియని బౌల్ట్‌.. దాన్ని నిజమైన ఇంటర్వ్యూగానే భావించాడు.

బౌల్ట్‌కు ఎలాంటి ప్రశ్నలు వేయాలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి డ్రెస్సింగ్‌ రూంలోపలి నుంచి ఫోన్‌లో  రియాన్‌ పరాగ్‌ సూచిస్తుండగా.. వాటిని హెడ్‌ఫోన్‌లో వింటూ తానే స్వయంగా అడుగున్నట్లు నటిస్తాడు. ఆ ప్రశ్నల్లో మీ గురించి మీరు హిందీలో చెప్పిండి, ఓ బాలీవుడ్‌ డైలాగ్‌ వినిపించండి, మీ కొత్త సారథి బెన్‌ స్టోక్స్‌పై మీ అభిప్రాయం, మీరు వేసుకుంది డెరిల్ మిచెల్‌ టీషర్టా? పొడుగ్గా ఉందేంటి? అంటూ చికాకు తెప్పించే ప్రశ్నలు వేశాడు. అయితే నిజమైన ఇంటర్వ్యూగానే భావించి బౌల్ట్‌ ఓపికతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు ఆటగాళ్లు వచ్చి నిజాన్ని బయటపెడతారు. ఏడు నిమిషాలకు పైగా సాగిన ఈ ప్రాంక్‌  ఆద్యంతం నవ్వులు పూయించింది. కాగా ఆ వీడియోను రాజస్థాన్‌ సోషల్‌ మీడియా విభాగం ట్విటర్‌లో పంచుకుంది. దాన్ని మీరూ చూసేయండి.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని