Harmanpreet kaur: అందుకే మైదానంలో వెనక్కి తగ్గను: హర్మన్‌ప్రీత్ కౌర్
ముంబయి వేదికగా డిసెంబర్ 9న ఆసీస్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్(T20 series) ముంగిట కెప్టెన్ హర్మన్‌ప్రీత్(Harmanpreet kaur) కౌర్ ఆసక్తికర విషయాలు తెలిపింది.
దిల్లీ: రానున్న టీ20 ప్రపంచకప్ 2023(T20 World cup 2023) ముంగిట ఆస్ట్రేలియా(Australia)తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్(T20 series)కు భారత అమ్మాయిలు సిద్ధమయ్యారు. ముంబయి వేదికగా డిసెంబర్ 9న ఆసీస్ జట్టును టీమ్ఇండియా ఢీకొనబోతుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet kaur) మాట్లాడుతూ తమ విజయాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకొంది.
‘‘జట్టులో కొందరు తమకు తాముగా గొప్ప ప్రదర్శన చేసేవారుంటారు. మరికొందరికి మాత్రం మన ప్రోత్సాహం అవసరం ఉంటుంది. వారిని కూడా అందరితో సమానంగానే చూడాల్సివుంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది.. జట్టు సభ్యులకు నా శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఫీల్డ్‌లో ఉన్న సమయంలో నాకు ఎక్కడా వెనక్కి తగ్గే అవసరం రాదు. ప్రతి టోర్నమెంట్లోనూ మేం మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి ఇది మాకు తోడ్పడుతోంది. నాతో ఏ విషయాన్నైనా సంకోచం లేకుండా పంచుకుంటారు. కాబట్టే నేను జట్టును సమర్థంగా నడిపించగలుగుతున్నాను. వారు చెప్పకపోతే ఆ సమస్య అలాగే ఉండిపోతుంది. నాకు తెలిసినంతవరకు జట్టును కలిసి కట్టుగా ఉంచడంలోనే విజయ రహస్యం దాగివుంది’’ అంటూ హర్మన్ ప్రీత్ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chinese spy balloon: అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్..!
-
Politics News
Kotamreddy: అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి
-
India News
Air India Express: గగనతలంలో ఇంజిన్‌లో మంటలు.. విమానానికి తప్పిన ముప్పు
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు