CWG 2022 : 30 కిలోలు తగ్గి కామన్వెల్త్‌కు

కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి బరిలో దిగిన తూలిక మాన్‌ జూడో మహిళల 78+ విభాగంలో రజతం పట్టేసింది. కానీ ఏడాది క్రితం అసలు ఈ క్రీడలకు ఆమె ఎంపికవడమే సందేహంగా మారింది. ఆమె అధిక బరువే అందుకు కారణం. ఈ క్రీడల కోసం నిరుడు ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌ జాబితాలోనూ తనకు చోటు దక్కలేదు. ఆ దశలో

Updated : 05 Aug 2022 07:25 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి బరిలో దిగిన తూలిక మాన్‌ జూడో మహిళల 78+ విభాగంలో రజతం పట్టేసింది. కానీ ఏడాది క్రితం అసలు ఈ క్రీడలకు ఆమె ఎంపికవడమే సందేహంగా మారింది. ఆమె అధిక బరువే అందుకు కారణం. ఈ క్రీడల కోసం నిరుడు ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌ జాబితాలోనూ తనకు చోటు దక్కలేదు. ఆ దశలో పట్టుదలతో శ్రమించిన ఆమె 30 కిలోలు తగ్గి.. 115 నుంచి 85 కిలోలకు చేరుకుంది. అప్పుడే ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పుడు రజతం దక్కడంతో నిరాశ వ్యక్తం చేసింది. ‘‘నేను ఇక్కడికి రజతం కోసం రాలేదు. వచ్చే సారి కామన్వెల్త్‌ క్రీడల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ నేను పతకం రంగు మార్చాల్సిందే. ఈ ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. ఫైనల్లో రెండు తప్పిదాలు చేశా. ఎదురు దాడి చేయలేకపోవడంతో పాటు రక్షణాత్మకంగా వ్యవహరించా. అది ఫలితాన్ని ఇవ్వలేదు. పసిడి కోసమే ఆలోచించా. దాన్ని అందుకోలేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నా. ఎన్నో ఇబ్బందులు దాటి ఇక్కడి వరకూ వచ్చా. మరిన్ని శిక్షణ శిబిరాల్లో పాల్గొని ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. 2011లో ఆట నుంచి విరామం తీసుకున్నా. తిరిగి యశ్‌పాల్‌ దగ్గరకు వెళ్లడంతో నా ఆట మెరుగైంది. అప్పుడు ఫిట్‌గా లేను. ఇప్పుడూ అలాగే ఉన్నా. అమ్మ, చెల్లి ప్రోత్సాహంతోనే నేనిక్కడ ఉన్నా’’ అని తూలిక చెప్పింది. తన తల్లి దిల్లీలో పోలీస్‌. ఆమెకు రెండేళ్ల వయసులో తన తండ్రి హత్యకు గురయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని