Sania Mirza: అమెరికన్ షో.. సెరెనాపై ప్రశ్నకు వింతైన ఆప్షన్లు.. స్పందించిన సానియా

సెరెనా విలియమ్స్‌ (serena)కు సంబంధించిన ప్రశ్నకు ఇచ్చిన ఐచ్ఛికాలు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీశాయి. వాటికి సానియా మీర్జా (sania mirza) స్పందించడం విశేషం.

Updated : 29 Dec 2022 19:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలుగులో ‘మీలో ఎవరుకోటీశ్వరుడు?’.. హిందీలో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఫేమస్‌ టెలివిజన్ షోలు.. హోస్ట్‌లు ప్రశ్నలు అడగటం.. పోటీకి వచ్చినవారు కరెక్ట్‌ సమాధానాలు చెప్పి ప్రైజ్‌మనీని గెలుచుకోవడం సర్వసాధారణం. అమెరికాలో ‘హూ వాంట్‌ టు బి ఏ మిలియనీర్?’ షో ఎంతో పాపులర్. అయితే పోటీకి వచ్చిన ఓ కంటెస్ట్‌కి షో నిర్వాహకులు ఆన్‌లైన్‌లో ప్రశ్నను సంధించారు. అప్పటి వరకు బానే ఉంది. కానీ హోస్ట్ ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాలే సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురి చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

అమెరికన్‌ షోలో కంటెస్ట్‌కి ఇచ్చిన ప్రశ్న.. ‘‘ఈ క్రింది టెన్నిస్‌ దిగ్గజాల్లో ఎనిమిది వారాల గర్భంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెలిచింది ఎవరు..?’’.. దానికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్, రోజర్ ఫెదరర్‌, జాన్‌ ఎన్రో అంటూ ఐచ్ఛికాలను ఇచ్చారు. ఇక్కడే అసలైన తమాషా.. ఎందుకంటే సెరెనా విలియమ్స్‌ కాకుండా మిగతా ముగ్గురు పురుష ఆటగాళ్లు కావడం విశేషం. అయితే ఇది గతేడాది షో సందర్భంగా జరిగిందని పలువురు కామెంట్లు పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా స్పందించడంతో మరోసారి ట్రోలింగ్‌ జరిగింది. ‘‘చాలా కష్టమైన ప్రశ్న’ అంటూ సానియా ట్వీట్‌ చేసింది. అయితే అది స్క్రీన్‌షాట్‌ తీసి పెట్టారని కొందరు కామెంట్‌ చేస్తుండగా.. మరికొందరేమో ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం కష్టమేనంటూ ఆటపట్టించారు. అయితే ఆ ఫొటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టినట్లు కూడా కామెంట్లు వస్తున్నాయి. అయితే ఆ ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం సెరెనా విలియమ్స్. ఆమె 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకొంది. అప్పుడు సెరెనా 8 వారాల గర్భవతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని