akash chopra: పాస్‌వర్డ్‌ అడిగిన నెటిజన్‌.. ఆకాశ్‌ రిప్లై ఇదీ

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రాకు ఓ సరదా సంఘటన ఎదురైంది.

Published : 29 Sep 2022 01:24 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, విశ్లేషకుడు ఆకాశ్‌ చోప్రాకు ఓ సరదా సంఘటన ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో తరచూ యాక్టివ్‌గా ఉండే ఆకాశ్‌ అభిమానులతో ఆట గురించిన తన విశ్లేషణలు పంచుకుంటుంటాడు. తాజాగా ఓ అభిమాని తన సమస్యకు పరిష్కారం చూపినందుకు కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్‌ చేయగా దానికి స్పందిస్తూ.. ‘మిత్రమా.. ఇది మన ఛానెల్‌’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి ఓ తుంటరి నెటిజన్‌ ‘అయితే పాస్‌వర్డ్‌ చెప్పండి’ అంటూ కామెంట్‌ చేశాడు. అతడికి ఈ మాజీ ఆటగాడు ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘శ్రమ.. సృజనాత్మకత.. పట్టుదల’’ అదే పాస్‌వర్డ్‌ అంటూ సరదాగా స్పందించాడు.  మొత్తానికి ఓ సీనియర్‌ ఆటగాడు తన కామెంట్‌కు బదులివ్వడం సంతోషంగా ఉందంటూ సదరు వ్యక్తి తెలిపాడు. ‘థాంక్యూ.. ఈ పాస్‌వర్డ్‌ పనిచేస్తుంది’ అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు