రష్యా, బెలారస్‌ అథ్లెట్లను 2024 ఒలింపిక్స్‌ నుంచి నిషేధించాలని ఉక్రెయిన్‌ క్రీడాకారిణి డిమాండ్

రష్యా, బెలారస్‌ దేశాలకు చెందిన క్రీడాకారులను 2024 ఒలింపిక్స్‌ నుంచి నిషేధించాలని ఉక్రెయిన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా డిమాండ్‌ చేశారు.

Published : 02 Feb 2023 20:02 IST

 

కీవ్‌: రష్యా, బెలారస్‌ దేశాలకు చెందిన క్రీడాకారులను 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి నిషేధించాలని ఉక్రెయిన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న అకృత్యాల గురించి రష్యన్‌, బెలారస్‌ ప్రజలకు ఏమాత్రం తెలియదన్నారు. మంగళవారం ఉక్రెయిన్‌ క్రీడల మంత్రి  గైడ్జైట్‌ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. రష్యా, బెలారస్‌లను 2024 ఒలింపిక్స్‌ నుంచి నిషేధించి తమ దేశానికి మద్దతివ్వాలని కోరారు.

రష్యా, బెలారస్‌ దేశాలకు చెందిన క్రీడాకారులు తటస్థ దేశాల తరఫున ఆడేందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (IOC) అనుమతించింది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి అనుకూలంగా ఉన్న వారిని మాత్రం అంతర్జాతీయ టోర్నమెంట్ల నుంచి ఐఓసీ నిషేధించింది. ఇటీవల మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023లో రష్యా, బెలారస్‌ క్రీడాకారులు తమ దేశం తరఫున కాకుండా వేరే దేశాల తరఫున ఆడారు. ఈ దేశాల క్రీడాకారులను గతేడాది వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌లో నిషేధిస్తే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాత్రం అనుమతించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు