WTC Finals:ప్రపంచ కప్‌ లాంటిది: ఉమేశ్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో విజయం సాధిస్తే... అది ప్రపంచ కప్‌ని సాధించిన దానితో  సమానమని  టీమిండియా పేసర్‌ ఉమేశ్ యాదవ్‌  అభిప్రాయపడ్డాడు. 

Published : 21 May 2021 22:32 IST


(photo: Umesh Yadav Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో విజయం సాధిస్తే... అది ప్రపంచ కప్‌ని సాధించిన దానితో సమానమని టీమిండియా పేసర్‌ ఉమేశ్ యాదవ్‌ అభిప్రాయపడ్డాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ని దృష్టిలో ఉంచుకుని శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నా. బయో బబుల్‌లో ఉండటం చాలా కష్టమైన పని. ఎందుకంటే క్వారంటైన్‌ సమయం ముగియగానే బయోబబుల్‌లోకి అడుగుపెట్టాలి. మొదట 10-15 రోజులు అంతా బాగానే ఉంటుంది. కానీ, తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ  అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే పరిమితమైన ప్రదేశంలో ఒకే చోట ఉండటం, ఎక్కడికీ వెళ్లేందుకు వీలుండదు కనుక అలసట వస్తుంది. కాబట్టి మానసికంగా ధృడంగా ఉండటం చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి ఎన్నో మంచి జట్లను ఓడించి ఇక్కడి వరకు రావడం పట్ల సంతృప్తికరంగా ఉన్నా. రవి భాయ్‌(కోచ్‌), కెప్టెన్ విరాట్ కోహ్లి నిజంగా చాలా కష్టపడుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌లాంటిదని ఇషాంత్ శర్మ, అజింక్య రహానే చెప్పింది నిజమే. నేను కూడా అలాగే భావిస్తున్నా. టెస్టు మ్యాచులు ఆడుతున్న ఆటగాడికి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌.. ప్రపంచకప్‌లాంటిదే’ అని ముగించాడు ఉమేశ్‌.

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ జరగనుంది. ఈ పోరులో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.  అనంతరం ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఉమేశ్ యాదవ్‌కి చోటు దక్కిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని