Gill: ‘శుభ్‌మన్‌.. నాగ్‌పుర్‌ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్‌ యాదవ్ ఫన్నీ ట్వీట్

యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌గిల్‌ను ఉద్దేశించి భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ట్విటర్‌లో ఓ ఫన్నీ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఆ ట్వీట్ ఏంటో తెలుసుకోవాలనుందా..?

Published : 04 Feb 2023 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌గిల్‌ను ఉద్దేశించి భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ట్విటర్‌లో ఓ ఫన్నీ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టీ20లో గిల్‌ శతకం బాదిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గిల్‌కు ఆటగాళ్లు, మాజీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అయితే తాజాగా ఉమేశ్‌ పెట్టిన పోస్టు మాత్రం ప్రశంసలకు సంబంధించి కాదు. మరి ఏంటో తెలుసుకోవాలనుందా..?

అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదిన గిల్‌కు ఓ అమ్మాయి ప్రపోజ్‌ చేసింది. నేరుగా కాదండోయ్‌.. ‘టిండర్‌’ శుభ్‌మన్‌తో నన్ను మ్యాచ్‌ చేయ్‌ అని రాసి ఉన్న పోస్టర్‌ను ఆ అమ్మాయి మైదానంలో ప్రదర్శించింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన ఆన్‌లైన్‌ డేటింగ్ యాప్‌ టిండర్‌.. ఆ అమ్మాయి పట్టుకున్న బ్యానర్‌ ఫొటోను జతచేసి ఫ్లెక్సీపై ‘శుభ్‌మన్‌ కాస్త ఇక్కడ చూడు’ అని రాసి నాగ్‌పుర్‌లో పలుచోట్ల హోర్డింగ్‌లు పెట్టింది. దీనిపై బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ సరదాగా స్పందించాడు. ‘‘నాగ్‌పుర్‌ మొత్తం చెబుతుంది. కాస్త ఇక్కడ చూడు’’ అంటూ హోర్డింగ్‌ ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశాడు ఉమేశ్‌. ఇదీ విషయం. దీన్ని చూసి శుభ్‌మన్‌ గిల్‌ ఎలా స్పందించాడో తెలియదు కానీ అభిమానులు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. గిల్‌ని ఆటపై దృష్టి పెట్టనివ్వండి అని కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు